Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

ధాన్యం కొనుగోలుపై ఆరాతీసిన ఆర్ డి ఓ

విశాలాంధ్ర, సీతానగరం: మండలంలోని మరిపివలస గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కె. హేమలత గురువారం ఆకస్మికంగా తనిఖీచేశారు. కొనుగోలు ఎలా చేస్తున్నారు, రవాణా ఎలా జరుగుతుంది, గోనె సంచులు అందజేస్తున్నారా లేదా అనే అంశాలతో పాటు ఇంతవరకు తరలించిన ధాన్యం డబ్బులు ఎంతమంది రైతులకు అందాయని అడిగి తెలుసుకున్నారు. తేమశాతం చూస్తున్నారా లేడా అని ప్రశ్నించారు. ధాన్యంకొనుగోలులో అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా ఉండి రైతులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా కొనుగోలు చేస్తూ సకాలంలో మిల్లులకు తరలింపు చేయించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఏఓ అవినాష్, సూరమ్మ పేట వి ఏ ఏ ఆమని, రైతులు,వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img