Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేవునిగుంప సోమేశ్వరుడుని దర్శించుకున్న ఆర్డీఓ డిఎస్పీలు

విశాలాంధ్ర – పార్వతీపురం: మన్యంజిల్లాలో కొమరాడ మండలం కోటిపాంపంచాయతీ దేవునిగుంపలో నాగావళి, జంఝావతినదుల మధ్యలో బలరాముడు ప్రతిష్టించిన ఆలయాల్లో
శ్రీసోమేశ్వరస్వామి ఆలయం ఒకటని చరిత్ర చెబుతుంది. శనివారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత,పార్వతీపురం డిఎస్పీ
ఏ.సుభాష్ లు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.ఆర్డీఓ హేమలత దర్శన నిమిత్తం వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ దేవాదాయ శాఖ వారు కనీస ప్రోటోకాల్ పాటించలేదని రెవెన్యూ సిబ్బంది వాపోయారు. ఆమెకు సంబందించి కొంతమంది కుటుంబ సభ్యులను అనుమతించక పోవడంతో బయటనుండి మొక్కులు తీర్చుకున్నారని తెలిసింది. ఇదిలాఉండగా దేవునిగుంప విచ్చేసిన డి.ఎస్పీ సుభాష్ ఏర్పాట్లుగూర్చి ఆరాతీసి రెండురోజులపాటు ఎటువంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.ఇక్కడ శనివారం శివరాత్రి పండుగ,రాత్రి జాగరణకార్యక్రమం చేయడంతోపాటు ఆదివారం పెద్దఎత్తున యాత్ర జరగడం గుంప ప్రత్యేకతని చెప్పవచ్చును శనివారం శివరాత్రి కంటే ఆదివారం యాత్రకు వివిధ ప్రాంతాల నుండే కాకుండా ఒడిస్సా నుండి భక్తులు పెద్దఎత్తున తరలి వస్తారు.శనివారం భక్తులకు రెండు చోట్ల అన్న సంతర్పణ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇదిలా ఉండగా మరో వైపు పార్వతీపురం మండలంలోని అడ్డాపుశీల గ్రామంలో కూడా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలవచ్చారు.ఈరెండు ఆలయాలల్లో శివరాత్రి, కార్తీకమాసంలో భక్తులు ఎక్కువగా వచ్చి శివుణ్ణి దర్శించుకుంటే సర్వపాపాలు పోతాయన్నది ఈప్రాంత ప్రజల, భక్తుల ప్రగాఢ విశ్వాసమని పలువురు తెలిపారు. అడ్డాపుశిలలో పెద్దనంది విగ్రహం ఉండగా, దేవునిగుంపలో ప్రకృతి సిద్ధంగా నాగావళినదిలో లభ్యమైన రెండునందులు ఉండటం ఈఆలయ విశిష్టతగా చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img