Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రిమాండ్ కు ఎర్రచందనం దొంగలు

సుమారు రెండు కోట్ల 10 లక్షల విలువ చేసే ఎర్రచందనం పట్టివేత

  • ప్రధాన ముద్దాయి సామ్యూల్ పరార్
  • వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ జీ అర్ రాధిక

విశాలాంధ్ర,టెక్కలి ( శ్రీకాకుళం):మంగళవారం టెక్కలి పోలీసులు చేజించిన ఎర్రచందనం దొంగలు పట్టివేతలో సుమారు రెండు కోట్ల 10 లక్షలు విలువ గల 404 దొంగలతో పాటు, 35 వేల రూపాయల నగదు, సుమారు ఒక్కొక్కటి 10 లక్షల విలువ చేసే మూడు వాహనాలు. 14 సెల్ ఫోన్లు నిందితుల నుంచి స్వాధీనం చేసి కేసు నమోదు చేసి మొత్తం 11 మంది నిందితులకు కోర్టులో హాజరు పరుస్తున్నట్లు జిల్లా ఎస్పీ అధికారి జి.అర్. రాధిక తెలిపారు, బుధవారం ఆమె టెక్కలి సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టెక్కలి పోలీస్ సర్కిల్ అధికారులు తో సహా ఆముదాలవలస, నరసన్నపేట, పలాస, సర్కిల్ ఇన్స్పెక్టర్లతో సహా, ఫారెస్ట్ అధికారులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు ఆమె వివరించారు, సాధారణంగా ఇటువంటి కేసుల్లో ఎర్రచందనం పట్టుబడి నిందితులు పరారవడం తరచూ జరుగుతోందని అయితే ముద్దాయిలు దొరకడం విశేషమని అందుకు ఇక్కడి సిబ్బందిని డిజిపి అభినందించినట్లు ఆమె తెలిపారు. కె.వీరస్వామి, ఎస్.అబ్బారావు, జి.ప్రతాప్, ఎస్.రాజేంద్రప్రసాద్, కె.దీప,కె.విజయ శ్రీనివాస్ రావు, పోలి రామ్మోహన్, బి.లక్ష్మీనారాయణ,ఎస్, ముకుంద, అభిజిత్ బుయన్,బి.ప్రధాన్ అనే పదకొండు మంది నిందితులను గుర్తించి అరెస్టు చేశామని, ఇంకా ముగ్గురు నిందితులతో పాటు ఎర్రచందనం అమ్మిన ప్రధాన ముద్దాయి సామ్యూల్ తృటిలో తప్పించుకున్నాడని ఆమె వివరించారు, శేషాచలం అడవుల నుండి దొంగతనంగా తెచ్చి ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు గ్రామమైన ఎస్ పైలం వద్ద ఈ ఎర్రచందనం దుంగలు నిల్వ ఉంచి బేరం కుదిరాక అచట నుండి చెన్నైకి తరలిస్తుంటారని ఆమె తెలిపారు. ఈ నిందితులందరికీ గతంలో ఇదే చరిత్ర కలవారని వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టీపీ విఠలేశ్వర రావు, డిఎస్పి శివరామరెడ్డి, టెక్కలి సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య చంద్రమౌళి, ఎస్సై సిహెచ్ హరికృష్ణ తోపాటు పలువురు పోలీసు అధికారులు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img