Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఈపంట నమోదు తప్పనిసరిగా నమోదు చేయాలి

జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్

విశాలాంధ్ర,పార్వతీపురం/పాచిపెంట: రైతులు పండించిన పంటకు ఈ క్రాప్ నమోదు పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారంనాడు జిల్లాలోని పాచిపెంట మండలంలోని పత్తిపంట ఇ క్రాప్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. రైతుపండించినపంట, ఏసమయంలో వేసింది , ఇ క్రాప్ నమోదు యాప్ లోని వివరాలను గ్రామవ్యవసాయ సహయకురాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఇ క్రాప్ నమోదు ఎంతమేరకు జరిగిందని కలెక్టర్ ప్రశ్నించగా పాచిపెంట సచివాలయం పరిధిలోని 205 ఎకరాలవరకు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎరువులుగూర్చి రైతు గుప్తేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు.  రైతుభరోసా కేంద్రాల్లో సరఫరా చేస్తున్న ఎరువుల గూర్చి ఆరాతీశారు. ప్రతీరైతు పంటను ఈపంటలో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనుల భవననిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పాచిపెంటలోని నిర్మాణంలో ఉన్న రైతుభరోసా కేంద్రం, గ్రామసచివాలయాలపనులను పరిశీలించారు.  ప్రత్యేక శ్రద్ధ చూపి వీలైనంత త్వరగా నూతన భవనాలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు పాలనా సౌలభ్యం అందించాలనే లక్ష్యం గూర్చి వివరించారు.నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు.ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం లబ్ధిదారుల వివరాల జాబితాను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సకాలంలో సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులు కాల పార్వతీ తో మాట్లాడి ఇంటి సామాగ్రి, సిమెంట్ ఎన్ని బస్తాలు అధికారులు అందించారు అనే వివరాలపై ఆరా తీశారు. గృహ నిర్మాణ బిల్లు మంజూరు అయ్యిందా అని ప్రశ్నించగా రూ.75 వేలు మంజూరైందని తెలపడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. జల జీవన్ మిషన్ క్రింద చేపట్టిన ఇంటింటికీ కుళాయిలు లను పరిశీలించారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ సంతోష్, ఇంచార్జి తహాసిల్దార్ ఎమ్.రాజశేఖర్, పంచాయత్ రాజ్ డిఈ చిన్నంనాయుడు, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు మధుసూదన రావు, వ్యవసాయఅధికారిఅనురాధ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img