Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఈ పంట నమోదును వేగవంతంగా పూర్తిచేయాలి

జిల్లా వ్యవసాయ శాఖాదికారి రాబర్ట్ పాల్

విశాలాంధ్ర, సీతానగరం: రైతులు ఈ పంట నమోదును వేగవంతంగా చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి రాబర్ట్ పాల్ తెలిపారు. ఆదివారం నాడుఆయన పెదభోగిలి గ్రామంలో  మండల వ్యవసాయ అధికారి అవినాష్ తో పాటు పర్యటించి ఈపంట నమోదును పరిశీలించారు.ఈపంట నమోదు ఏవిధంగా జరుగుతుందని గ్రామవ్యవసాయ సహాయకులుని అడిగి తెలుసుకున్నారు.గ్రామవ్యవసాయ సహాయకులతోసమావేశం నిర్వహించి  పీఎం కిసాన్ ఈకేవైసీత్వరితగతిన
పూర్తిచేయాలనీ ఆదేశించారు.  మూడు రోజులు మాత్రమే సమయం ఉందని వేగంగా పూర్తి చేయాలన్నారు. రైతులు నష్టపోకుండా ప్రతీ రైతు భూమిని నమోదు చేయాలన్నారు. ఈ పంట నమోదుకొరకు కౌలు రైతులు ఎవరైనా సాగు చేస్తే గ్రామ రెవెన్యూ అధికారి ద్వారా సాగు పత్రం తీసుకొని పంట నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసారు. పూర్తి వివరాలకు సచివాలయంలోని వి ఏ ఏ లను సంప్రదించాలని కోరారు. వి ఏ ఏ లు కూడా మూడు రోజుల పాటు రైతులకు అందుబాటులో ఉండి పూర్తిగా సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలోపలువురు రైతులు, విఏఏ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img