Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

పార్వతీపురం మన్యం జిల్లాలోచురుగ్గా ఈపంట నమోదు కార్యక్రమం

జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్

విశాలాంధ్ర,పార్వతీపురం/సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లాలో అన్ని మండలాల్లో ఈ పంట నమోదు చురుగ్గా జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్ తెలిపాడు.మంగళ వారం ఆయన సీతానగరం మండలంలో ఈపంట నమోదు, పొలం బడి కార్యక్రమాలని పరిశీలించారు. అన్ని రైతుభరోసా కేంద్రంలలోఉన్న వ్యవసాయ సహాయకులుద్వారా ఈపంట నమోదు కార్యక్రమం చురుగ్గా జరుగుతుందని చెప్పారు.ఆర్. వెంకమ్మపేట,రామవరం గ్రామాలను సందర్శించి రైతులతో మాట్లాడారు.అనంతరం వరి పంట సాగును కూడా పరిశీలించారు. అన్ని గ్రామాలలో రైతులు సెప్టెంబర్ 7లోగా ఈపంట నమోదు చేసుకోవాలని, ప్రతీ ఒక్కరూ మీపంట ఎంతవిస్తీర్ణంలో వేసారో ఏపంటవేసారో తెలియజేసి పంటనమోదు చేసుకోవాలన్నారు. ఈపంట నమోదు వలన ధాన్యం కొనుగోలులో ధాన్యం అమ్ముకోవడానికి, అలాగే ఉచితపంటలు బీమా మరియు పంట నష్ట పరిహారం జరిగితే ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ఆయనతోపాటు మండల వ్యవసాయాధికారి అవినాష్ విఏఏ లు, రైతులు పాల్గొన్నారు. జిల్లా ఉత్తమ అధికారిగా ఎన్నికైన అయనను,ఉత్తమ మండలవ్యవసాయ అధికారిగా ఎంపికైన అవినాష్ ను నాయకులు, ప్రజా ప్రతినిధులు,అధికారులు, విఏఏలు, రైతులు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img