Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

స్పందన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేయాలి

మన్యం జిల్లాఎస్పీ  వి.విద్యాసాగర్ నాయుడు

విశాలాంధ్ర,పార్వతీపురం: స్పందన ద్వారా వచ్చిన పిర్యాదులను పరిశీలించి తక్షణమే పరిష్కారం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లాఎస్పీ వి.విద్యా సాగర్ నాయుడు తెలిపారు.సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలనుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఓర్పుగా తెలుసుకొని, సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులతో ఫోనులోమాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి చట్టపరిధిలో తక్షణమే చర్యలు చేపట్టి,ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలనుండి తొమ్మిది ఫిర్యాదులను వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించి, జిల్లాపోలీసు కార్యాలయానికి నివేదికలు పంపాలని అధికారులను ఆయన ఆదేశించారు.ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ ఓ.దిలీప్ కిరణ్, ఎస్బి సిఐ ఎన్.శ్రీనివాసరావు, ఎస్ఐ దినకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img