Friday, April 19, 2024
Friday, April 19, 2024

మెగా రక్తదాన సిబిరానికి స్పందన

బిజెపి, కెమిస్ట్ & డ్రగ్గిస్టు అసోసియేషన్ సహకారంతో 53 యూనిట్లు సేకరణ

విశాలాంధ్ర – పార్వతీపురం,బెలగాం : భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని పార్వతీపురం మన్యం జిల్లా భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షులు కెఎం దిల్లేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం  పార్వతీపురం మన్యం జిల్లా బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ మంతిని వినోద్ కుమార్, జిల్లా టిబి లెప్రసి ఎయిడ్స్ అధికారి డా. సిహెచ్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో బిజెపి జిల్లా కార్యాలయంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు ద్వారపు రెడ్డి శ్రీనివాసరావు, జిల్లా ఇంచార్జ్ కాటన్ నారాయణరావు, రాష్ట్ర కోర్ కమిటీ నెంబర్ నిమ్మక జయరాజు హాజరయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా రక్త నిధి కేంద్రం సిబ్బంది  23 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సిక్యూటివ్ మెంబర్ పాలూరు భారతి, పార్టీ పట్టణ అధ్యక్షులు అల్లూరు పేర్రాజు, నాయకులు పళ్లెం కనకారావు, పి. అప్పారావు, రొంపిల్లి తిరుపతిరావు, తెంటు చంద్రశేఖర్, ఏగిరెడ్డి ఈశ్వరరావు, సుందర ఆనందు, డబ్బురు సూరిబాబు, పార్టీ పట్టణ అధ్యక్షులు అల్లూరు పేర్రాజు, బడి తాతబాబు, గండి మురళి తదితరులు పాల్గొన్నారు.
అలాగే స్థానిక ఎస్వీడి కళాశాలలో, బిజెపి కార్యాలయంలో పార్వతీపురం కెమిస్ట్ & డ్రగ్గిస్టు అసోసియేషన్ సహకారంతో పార్వతీపురం మన్యం జిల్లా బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ మంతిని వినోద్ కుమార్, జిల్లా టిబి లెప్రసి ఎయిడ్స్ అధికారి డా. సిహెచ్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో 30యూనిట్ల రక్తాన్ని పార్వతీపురం జిల్లా ఆసుపత్రి రక్తనిధి కేంద్ర సిబ్బంది సేకరించారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా డిఎం&హెచ్ఓ బి. జగన్నాధరావు, జిల్లా డ్రగ్ ఇన్ స్పెక్టర్ లావణ్య, బ్లడ్ బ్యాంకు సిబ్బంది మజ్జి మధు, నాయక్, నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img