Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

స్పందనలో వచ్చిన వినతలను సకాలంలో పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్


విశాలాంధ్ర,పార్వతీపురం : స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన వినతులను సంబందించిన అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకొని త్వరితగతిన పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఓ.ఆనంద్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సి.విష్ణు చరణ్, జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకటరావులు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలనుండి అర్జీలను స్వీకరించారు.
బొబ్బిలి మండలం మోసేవలస గ్రామానికి చెందిన ఎం.నూకరాజు,గ్రామస్తులు విచ్చేసి విజయనగరంజిల్లా, బొబ్బిలి మండలం, గోపాలరాయుడుపేట పంచాయితీలోనున్న మోసేవలస గ్రామాన్ని పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం ఆర్ వెంకంపేట రెవెన్యూలో చేర్చాలని కోరారు.జియ్యమ్మవలస మండలం వీర బ్రహ్మేంద్రపురం గ్రామానికి చెందిన జ్యోతి, గ్రామస్తులు తమ గ్రామానికి కరెంట్ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కరెంటు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు.భామిని మండలం మనం కొండ గ్రామం నుండి 20 సంవత్సరాలుగా మనంకొండ గ్రామంలో నివసిస్తున్నామని, సర్వేనంబర్ 57-1లో 14.96 ఎకరాల సాగు చేస్తున్నామని,ఈభూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని ఎన్.అన్నయ్య ఇతరులు వినతి పత్రం అందజేశారు.
పార్వతీపురంలో పోస్ట్ మెట్రిక్ కళాశాల వసతులు లేనందున గిరిజన పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని గిరిజన సంఘాల అధ్యక్షులు డి.సీతారాంఇతరులు దరఖాస్తు అందజేశారు.సాలూరు మండలం పురోహితునివలస గ్రామానికి చెందిన వి.నాగమణి (కుక్) అరుణకుమారిలు (వార్డెన్) గా ఏ.పి మోడల్ స్కూల్ లో విధులు నిర్వహిస్తున్నామని, మాకు 18 నెలలగా జీతాలు రావడంలేదని జీతం ఇప్పించగలరని వినతి పత్రాన్ని అందజేశారు.గరుగుబిల్లి మండలం సన్యాసి రాజుపేట గ్రామానికి చెందిన బి. పావని పెన్షన్, వినికిడి మిషన్ మంజూరు చేయాలని కోరారు.పార్వతీపురం మండలం పెదమరికి గ్రామానికి చెందిన వి.శ్రీరంగరాజు, బి.జనార్దన పెదమరికి పంచాయితీ నిధులు దుర్వినియోగం చేసే వారిపైన చర్యలు తీసుకోవాలని దరఖాస్తు అందజేశారు.సీతంపేటమండలం జల్లార గ్రామానికి చెందిన బి.సత్యం వైట్ రేషన్ కార్డు అర్హత ఉన్నప్పటికీ ఒకసంవత్సరం నుంచి రేషన్ ఇవ్వడం లేదని, రేషన్ ఇప్పించవలసిందిగా కోరారు.పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామానికి చెందిన బి.గౌరీశ్వరి పీఎంఇజిపి లోనుకు దరఖాస్తు చేసిన బ్యాంకు విల్లింగ్ ఇవ్వడం లేదని దరఖాస్తు అందజేశారు.సీతంపేట మండలం సంకిలి గ్రామానికి చెందిన బి.మోహన్ రావు, గ్రామస్తులు దిగువసంకిలి నుండి ఎగువ సంకిలి వరకు రోడ్ పూర్తి కావలసి ఉన్నదని, వర్షంవలన రోడ్డు పూర్తిగా పాడైపోయిందని కావున దిగువ సంకిలి నుంచి ఎగువ సంకిలి వరకు రోడ్డు బాగు చేయాలని కోరారు.బలిజిపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఎస్.అన్నపూర్ణ పాతసదరం సర్టిఫికెట్ రద్దుచేసి కొత్తసదరం సర్టిఫికెట్ మంజూరు చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో జిల్లా వెద్య ఆరోగ్య అధికారి బి.జగన్నాథ రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.జి.కృష్ణాజి, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ప్రభాకరరావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామచంద్రరావు, గ్రామ, వార్డు సచివాలయాల సమన్వయ అధికారి వి.చిట్టి బాబు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్, జిల్లా సరఫరా అధికారి కె.వి.ఎల్.ఎన్ మూర్తి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి సత్యనారాయణ, జిల్లాపశుసంవర్డక అధికారి ఈశ్వరరావు, జిల్లా విద్యా శాఖ అధికారి డా.ఎస్.డి.వి రమణ, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఉరిటి సాయి కుమార్, జిల్లా ప్రణాళిక అధికారి వీర రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img