Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

పారిశుధ్యమే ప్రధమకర్తవ్యం కావాలి

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

విశాలాంధ్ర,పార్వతీపురం/పాలకొండ : పారిశుధ్యమే ప్రధమకర్తవ్యం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపు నిచ్చారు.పాలకొండ మునిసిపాలిటి పరిధిలోని ఎన్.కె.రాజపురం, ఇందిరా నగర్ కాలనీ, నీలమ్మ కోలనీలను, వెలగవాడ, కొండాపురం వెల్ నెస్ కేంద్రాన్ని, రైతుభరోసాకేంద్రాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. రీసర్వే డేటాఎంట్రీ చేస్తున్న విధానాన్ని రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో పరిశీలించారు. సింగన్నవలస సచివాలయం, లుంబూరు జగనన్న గృహ నిర్మాణ కాలనీపనులను తనిఖీ చేశారు. ఎన్.కె.రాజపురం, ఇందిరా నగర్ కాలనీ, నీలమ్మ కోలనీలలో పారిశుధ్యంను పరిశీలించారు. ఎన్.కె.రాజపురంలో కాలువలు లేకపోవడంపట్ల మునిసిపల్ కమీషనర్ ను ప్రశ్నించారు. పారిశుధ్యంసక్రమంగా లేకపోవడంవలన డెంగీవంటి కేసులు వస్తున్నాయన్నారు. ప్రతివీధి, వాడ పారిశుధ్య రహితనిలయంగా ఉండాలని ఆయన ఆదేశించారు. డివిజనల్ స్థాయి అధికారులను పారిశుధ్యంను పర్యవేక్షించుటకు నియమించామని తెలిపారు. పారిశుధ్యంను సమష్టి బాధ్యతగా ప్రతిఒక్కరూ గుర్తించాలని హితవు పలికారు. అధికార యంత్రాంగానికి ప్రజలు సహకరించి ఆరోగ్యకర వాతావరణ పరిస్థితులు నెలకొల్పాలని కోరారు. నివాసం ఉంటున్నది మనమేనని గుర్తించాలన్నారు. పారిశుధ్యం నిర్వహణకు ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించాలని కమీషనర్ రామారావును ఆదేశించారు.
లుంబూరు జగనన్న గృహకాలనీ నిర్మాణాలు వేగవంతంచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కాలనీలో రహదారులు, విద్యుత్ తదితర మౌళిక సదుపాయాలు కల్పించడంలో ప్రాదాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. పట్టణానికి సమీపంలో కాలనీ ఉందని, మంచి భవిష్యత్తు ఉంటుందని లబ్ధిదారులు త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మౌళిక సదుపాయాలు కల్పించుటకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన చెప్పారు. గృహ నిర్మాణ సామగ్రి అందించడం జరుగుతుందని, బిల్లులు సకాలంలో వస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తున్న గ్రామసచివాలయం, వెల్ నెస్ కేంద్రం, రైతు భరోసా కేంద్రంలను త్వరితగతిన పూర్తి చేసి వాటి సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని ఆదేశించారు. ఆర్.డి.ఓ కార్యాలయంలో  రీసర్వే పనులడేటాఎంట్రీ పరిశీలించిన జిల్లా కలెక్టర్ తప్పులులేని రెవిన్యూ రికార్డులు తయారు కావాలని ఆదేశించారు. రెవిన్యూ పత్రాల జారీలో ఎటువంటి ఆటంకం ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. కౌలు రైతులకు సాగు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో సమస్యలు ఉండరాదని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారి జి.మురళి, డివిజన్, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img