Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ‘సేవ్ జర్నలిజం’


కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన
సమస్యల పరిష్కారానికి జేసీకి వినతిపత్రం అందజేత

విశాలాంధ్ర – పార్వతీపురం: పాత్రికేయుల సమస్యలు పరిష్కారంతో పాటు పాత్రికేయులపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా జర్నలిస్టులు పిలుపునిచ్చారు.ఇండియన్ జర్నలిస్టు యూనియన్(ఐజేయూ) పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు(ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో “సేవ్ జర్నలిజం” కార్యక్రమాన్ని గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించారు. ముందుగా కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఆనంద్ కు వినతిపత్రం అందజేశారు. జర్నలిజాన్ని కాపాడాలని, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, గుర్తింపు కలిగిన జర్నలిస్టు సంఘాల ప్రతినిధులను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. హెల్త్ ఇన్స్యూరెన్స్ రెన్యువల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టు సమస్యలపై సానుకూలంగా స్పందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఆనంద్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జాతీయ కౌన్సిల్ మెంబర్ గంగి శ్రీనివాసరావు, ఏపీయూడబ్ల్యూజే పార్వతీపురం మన్యం జిల్లా కన్వీనర్ఏ .కిషోర్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img