Friday, April 19, 2024
Friday, April 19, 2024

లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలి

జాయింట్ కలెక్టర్ ఆనంద్

విశాలాంధ్ర,పార్వతీపురం: గిరిజన సహకార సంస్థలో లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక గిరిజన సహకార సంస్థ కార్యాలయ సమావేశమందిరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గిరిజన సహకార సంస్థ అభివృద్ధి చెందాలంటే డీలర్లు, సేల్స్ మేన్స్, కాంట్రాక్ట్ సేల్స్ మేన్స్, మహిళా సంఘాలు కలిసి పని చేయాలని సూచించారు. జిల్లాలోఉన్న అన్ని గ్రామాల్లో పర్యటించి రచ్చబండ నిర్వహించాలని అన్నారు. కనీసం పది నుండి ఇరవై మందిని సమావేశపరిచి జిసిసి కొనుగోలు చేసే వస్తువు యొక్కనాణ్యత, ధరను వారికి వివరించాలన్నారు.ఏనెలలో
ఏవస్తువు కొంటారో ముందుగానే వారికి తెలిపాలని, వాటికి సూచించిన ధరను కూడా తెలపాలన్నారు. ధరలకు సంబంధించి కరపత్రాలు తయారుచేసి రైతులకు తెలిసేలా గ్రామంలో అతికించాలని సూచించారు. గిరిజన ఉత్పత్తులు పెంచాలని, స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని అన్నారు. గిరిజన సహకార సంస్థ  ప్రభుత్వ సంస్థ కాదు , దానిని నమ్ముకుని జీవిస్తున్న వారు సంస్థ అభివృద్ధి కి పాటుపడాలని సూచించారు. రూ.4.30 కోట్ల లక్ష్యాన్ని సాధించాల్సి ఉండగా, కేవలం కోటి మాత్రమే లక్ష్యాన్ని సాధించారని, సంస్థ మనుగడ ప్రశ్నర్ధకంగా మారకూడదని, సంస్థ అభివృద్ధి చెందితేనే జీతాలు వస్తాయని లేని పక్షంలో కష్టమని తెలిపారు. ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేయాలని,సిబ్బంది గ్రామాల్లో  పర్యటించి, రైతులను సమావేశ పరిచినప్పుడు  సంబంధించిన ఫోటోలను తీసి గ్రూప్ లో పెట్టాలని సూచించారు. వరిపంటకు సంబంధించి మీలక్ష్యాల్లో పెట్టొదని అన్నారు. మిగతా ఉత్పత్తులపై దృష్టి సారించాలని తెలిపారు. కొన్ని గ్రామాల్లో  సేల్  తక్కువగా ఉన్నప్పుడు వాటి సేల్ పెరిగేలా  సేల్స్ మెన్స్ చొరవ చూపాలన్నారు.ఈకార్యక్రమంలో గిరిజన సహకార సంస్థ జిల్లా మేనేజర్ మహేంద్ర కుమార్, సాలూరు బ్రాంచ్ మేనేజర్ రామారావు, గుమ్మలక్ష్మీపురం బ్రాంచ్ మేనేజర్ శ్రీరాములు,
డీలర్లు, సేల్స్ మెన్స్, కాంట్రాక్టు సేల్స్ మెన్స్, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img