Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఘనంగా సిర్లి ఎల్లమ్మతల్లి జాతర

పోటెత్తిన భక్తజనం

విశాలాంధ్ర, సీతానగరంమండలకేంద్రంలో సోమవారంనాడు సిర్లి ఎల్లమ్మతల్లి జాతర కార్యక్రమం ఘనంగా జరిగింది.పెద్దఎత్తున భక్తులు,యువకులు,మహిళలు,విధ్యార్ధులు, వివిధ గ్రామాలప్రజలు తరలి వచ్చి తల్లిని దర్శించుకున్నారు. దేవరవీధిలోని పోస్టు ఆఫీస్ ఎదుటగల ఆలయంలో వేకువజాము నుండే ప్రారంభ మైనపూజలు రాత్రివరకు కొనసాగాయి. మహాశివరాత్రి తరువాత నిర్వహించే ఎళ్ళారమ్మ జాతరలో గుడ్లు,ఉలవలు, బియ్యం,అరటి పండ్లుతో భక్తులు పూజలు నిర్వహించారు.ఎల్లమ్మతల్లిని దర్శిస్తే చర్మ వ్యాధులు రావని, అందరికీ తల్లి ఆశీస్సులు ఉంటాయని అర్చకులు కొనకల గణేష్ చెప్పారు.సీతానగరం, పెదబోగీలి, బుడ్డిపేట, అప్పయ్యపేట,చినభోగిలి, జోగమ్మపేట , లక్ష్మిపురం,గుచ్చిమి, తామరఖండి,బక్కపేట గ్రామాలతోపాటు తదితర గ్రామాలకు చెందిన భక్తులు, యువత,మహిళలు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఏటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్ ఐ నీలకంఠం, ఏ ఎస్ ఐ శ్రీనివాసరావుల అధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సిర్లి జాతరను కమిటీ అధ్యక్షులు చెలికాని వెంకట గోపాల కృష్ణ, కమిటీ సభ్యులు ఎంపిడిఓ కృష్ణ మహేష్ రెడ్డి, మండల పరిషత్ సిబ్బంది,తహశీల్దార్ ఎన్వీ రమణ,సిబ్బంది, పి హెచ్ సి వైద్యులు ఉషారాణి,సిబ్బంది, జిల్లా ఇమ్మూనైజేషన్ అధికారి డాక్టర్ జగన్,సర్పంచ్ తేరేజమ్మ, ఉపసర్పంచ్ అరవింద్,ఎంపీటీసీలు కుసుమసూర్యనారాయణ, గౌరీకిరణ్, వార్డు మెంబర్ బూడి రామారావు, సెక్రటరీలు వెంకటరావు,సుధారాణి రెండు సచివాలయంలసిబ్బంది, దేవరవీది యువత తదితరులు పాల్గొన్నారు.త్రాగునీరు, పులిహోరా
పేకెట్లును దాతలు అందజేశారు. ఇదిలా ఉండగా అంటిపేట గ్రామంలో కూడా సిర్లి జాతర జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img