Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

గణితంను నేర్చుకోవడంలో మెలుకువలు ఎంతో అవసరం

గణిత వేదపండితుడు బొమ్మరిల్ల నాగేశ్వరరావు

విశాలాంధ్ర,పార్వతీపురం/పార్వతీపురం రూరల్: విద్యార్ధులు గణితంను నేర్చుకోవడంలో మెలుకువలు, చిట్కాలు పాటిస్తే అందరికీ గణితం ఎంతోసులభంగా అర్ధమవుతుందని గణిత వేధపండితుడు బొమ్మరిల్ల నాగేశ్వరరావు తెలిపారు.గురువారం పార్వతీపురం మండలంలోని
పెదబొండపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్
సిఈఓ జయరామిరెడ్డి అదేశాలు మేరకు ఒకరోజు శిక్షణకార్యక్రమాన్ని స్తానిక  ప్రాధమిక పాటశాల (స్పెషల్) అధ్వర్యంలో  నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల హెచ్ ఎం ఇప్పర్తి గౌరీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బొమ్మరిల్ల నాగేశ్వరరావు రిసోర్స్ పర్సన్ గా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో దోహపడతాయని చెప్పారు.విద్యార్థులకు,ఉపాధ్యాయులకు గణితంపై పాలు సందేహాలను నివృత్తి చేశారు. నేటిరోజుల్లో అందరూ గణితాన్ని ఎంతో ప్రేమిస్తున్నారన్నారు. వేదంలో గణిత శాస్త్రానికి ఉండే ప్రాధాన్యత వివరించారు. అయనను అంతా కలిసి ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ సూరిదేముడు ఒకరోజు శిక్షణ కార్యక్రమం అవశ్యకతను గూర్చి వివరించారు.ఇటువంటి శిక్షణతరగతులు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎంతో అవసరమన్నారు.ఈశిక్షణ కార్యక్రమంలో పిఎంసి ఛైర్మన్ పప్పల శ్రీనివాస్,ప్రాధమిక పాఠశాలహెచ్ఎం మంతినిశ్రీనివాసరావు,
ఉపాధ్యాయులు రామలింగస్వామి, అమరాపు సూర్యనారాయణ, గొరజాన ప్రసాద్ తదితర ఉపాధ్యాయులు, విధ్యార్ధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img