Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రజాసమస్యలు పరిష్కారం చేయండి

సీతానగరం సర్వసభ్య సమావేశంలో సభ్యుల విజ్ఞప్తి

విశాలాంధ్ర,సీతానగరం: పలుగ్రామాల్లో ప్రజల సమస్యలపై అధికారులు దృష్టి సారించి పరిష్కారంచేయాలని పలువురు ఎంపీటీసీలు,సర్పంచులు డిమాండ్ చేశారు.సోమవారం స్థానిక మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం ఎంపీపీ బలగ. రవనమ్మశ్రీరాములునాయుడు అధ్యక్షతన జరిగింది. పలు గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు,సర్పంచులు మాట్లాడుతూ మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొని వచ్చారు. వాటిని పరిష్కారం చేస్తామని ఆయా శాఖల అధికారులు తెలిపారు.బుదవారంలోగా ఈపంట నమోదు పూర్తి చేయాలని, దీనిపైరైతులందరికీ తెలియజేయాలని మండల వ్యవసాయశాఖాదికారి అవినాష్ తెలిపారు. డ్రోన్లతో జరుగుతున్న భూసర్వే గూర్చి తహశీల్దార్ ఎన్వీ రమణ తెలిపారు. నాడు నేడు పనులు గూర్చి మండల విద్యాశాఖఅధికారి సూరిదేముడు తెలిపారు. వైద్య సేవల గురించి వైద్యులు శిరీష,నీలిమ, రాధాకాంత్ లు వివరించారు. విద్యుత్ సరఫరా,సమస్యలు తదితర అంశాలపై
ఏఈ సోమేశ్వరరావు తెలిపారు. గృహనిర్మాణ పథకాలు, ఇళ్ళు నిర్మాణాలు, జగనన్నకాలనీ ఇల్లగూర్చి హౌసింగ్ ఏఈ జానకీరాం చెప్పారు. గ్రామాలలో చేస్తున్న ఉపాధి హామీ పథకం పనులు, చెల్లింపుల గూర్చి ఏపిఓ నాగలక్ష్మి, వెలుగు పథకాలుగూర్చి ఏపిఎం శ్రీరాములునాయుడులు తెలిపారు. జలజీవన్ మిషన్ పనులుగూర్చి, గ్రామాలలో చేస్తున్న ఆర్డబ్ల్యుఎస్ పథకాలను జెఈ పవన్ వివరించారు. అంగన్వాడీ కేంద్రాలలో పోషక పదార్థాలు గూర్చి, నాడు నేడు పనులు గూర్చి ఐసిడిఎస్ పిఓ విజయలక్ష్మి సూపర్ వైజర్లు అరుణకుమారి,అరుణ, భాగ్యలక్ష్మిలు చెప్పారు. గ్రామాల్లో పశువైద్యశాఖఆద్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు, పశుసంపద అభివృద్ధి, పాలఉత్పత్తులు, పశుగ్రాసం పెంపకం తదితర అంశాలపై నిడగల్లు పశువైద్యులు రామారావు వివరించారు. ఈకార్యక్రమంలో ఎంపిడిఓ ప్రసాద్, జడ్పీటీసీ మామిడి బాబ్జి,ఈఓపిఅర్డి వర్మ, రోడ్లు,భవనాలుశాఖ జెఈ రామ్మోహన్,ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది నాగభూషణరావు, శేఖర్, ప్రసాద్ లతోపాటు వివిధశాఖాఅధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.  

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img