Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మన్యంజిల్లాల్లోని నిడగల్లులో కిడ్నీ వ్యాధులపై ప్రత్యేక వైద్య పరీక్షలు

జనసేన స్పందన పిర్యాదుపై జిల్లా కలెక్టర్ ఏర్పాటు
146మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహణ

విశాలాంధ్ర – సీతానగరం : పార్వతీపురం మన్యం జిల్లాల్లోని సీతానగరం మండలంలోని పెదంకలం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిదిలో నిడగల్లు గ్రామంలో కిడ్నీ వ్యాధికేసులపై ప్రత్యేక వైద్య బృందం సోమవారం స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈగ్రామంలో క్వారీలుఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో ఎక్కువమందికిడ్నీ రోగులు గ్రామంలో ఉన్నందున ఏర్పాటు చేయవద్దని,వ్యాధులు రావడానికి కారణాలు ఏమిటని పలుసార్లు గ్రామానికి చెందిన జనసేన సైనికులు స్పందనలో జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ కు పిర్యాదులు చేశారు.దీంతో జిల్లా కలెక్టర్ విశాఖపట్టణం ఆంద్రా మెడికల్ కాలేజీ ఆసుపత్రి నుండి ప్రత్యేక వైద్య బృందాన్ని రప్పించి సోమవారం వైద్యపరీక్షలు ఏర్పాటుచేశారు.గ్రామంలో ఎక్కువమందికి రావడానికి గలకారణాలను కనుగొనాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ను కోరారు. విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కళాశాలకుచెందిన నెప్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రత్న ప్రభ, ఎండి డాక్టరు విజయ్ కుమార్, మైక్రో బయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మంజుషా,ఎస్పిఎం డాక్టరు కళ్యాణీ, ల్యాబ్ టెక్నీషియన్ ఎస్ ఎస్ ప్రసాద్ పట్నాయక్ లు గ్రామంలోని 146 మంది కిడ్నీ బాధితులు, కిడ్నీ లక్షణాల అనుమానితులతో మాట్లాడి,ఆరోగ్య పరంగా ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనుమానిత లక్షణాలుఉన్న ఈ146మందికి స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించారు.నిపుణులైన బృందసభ్యులు నిర్వహించిన నివేదిక తనకు అందజేయాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డాక్టరు జగన్నాథరావును జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, నివేదికవచ్చిన అనంతరం తక్షణచర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ చెప్పారు. ఈకార్యక్రమంలోజిల్లా కలెక్టరుతోపాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టరు జగన్నాధం, ఆర్ బి ఎస్ ప్రాజెక్టు అధికారి డాక్టరు భాస్కరరావు, పెదఅంకలం,తోనాం,రావివలస,
పెదబొండపల్లి,శంబర ఆరోగ్యకేంద్రాల వైద్యులురాధాకాంత్,అజయ్,కార్తీక్,
అనూష, కిరణ్ కుమార్, తహశీల్దార్ ఎన్వీ రమణ, ఎస్ఐ నీలకంఠం,
సర్పంచ్ అరుద్రమ్మ, వైస్ ఎంపిపి సూర్యనారాయణ, గాజాపుశ్రీను, జనసేన నాయకుడు పి శ్రీను, సెక్రటరీ తిరుపతిరావు, ఎంఎల్ హెచ్ పి ధరణీ జిల్లాలోని పలుప్రాధమిక అరోగ్యకేంద్రాల వైద్యసిబ్బంది, సచివాలయ ఆరోగ్య సిబ్బంది, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img