Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

క్రీడలతోనే మానసికోల్లాసం

ఎస్ఎస్ఆర్ చారిటబుల్ అధినేత సూర

విశాలాంధ్ర-శ్రీకాకుళం:క్రీడలతోనే శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ అధినేత సూర శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి సాఫ్ట్ బాల్ బాలబాలికల జూనియర్స్ , సబ్ జూనియర్స్ ఎంపికలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీడాకారులు పట్టుదల, క్రమశిక్షణతో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోగలరన్నారు. జిల్లా ఎందరో జాతీయ , అంతర్జాతీయ క్రీడాకారులకు పుట్టినిల్లు అని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు క్రీడాస్ఫూర్తిని సాగాలన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. సాఫ్ట్ బాల్ క్రీడకు ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. జాతీయ స్థాయిలో రాణిస్తే ప్రభుత్వ కొలువు కూడా లభిస్తుందన్నారు. క్రీడలకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రీడాసంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img