Friday, April 19, 2024
Friday, April 19, 2024

తామరఖండిలో ఘనంగా జరిగిన శ్రీశ్రీశ్రీ పెద్దమ్మతల్లి పండుగ

విశాలాంధ్ర,సీతానగరం:మండలంలోని తామరఖండి గ్రామంలో సోమవారం నుండి ప్రారంభమైన శ్రీశ్రీశ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారి పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం సిరిమాను సంబరం అంబరాన్ని తాకేల నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మతల్లికి జేజేలు అంటూ సిరిమాను రథంపైకి అరటిపండ్లు విసురుతూ చీరలు చూపి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతీ మూడేళ్లకు ఒకసారి గ్రామంలో పండుగని జరుపుకుంటామని, అమ్మతల్లి ఆశీస్సుల వల్లే పంటలు బాగా పండి, అంతా ఆరోగ్యంగా ఉంటున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ, పటాసు సామాగ్రిని కాలుస్తూ యువత కేరింతలు కొడుతుంటారు. వివిధ గ్రామాలకు చెందిన బందువులు,స్నేహితులు,నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పండుగకు వెళ్లి అమ్మవారిని దర్శించుకుని వారిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img