విశాలాంధ్ర సంతబొమ్మాళి( శ్రీకాకుళం): శ్రీకాకుళం ఇందిరా విజ్ఞాన్ భవన్లో రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులుగా నియమితులైన శ్రీమతి బొడ్డేపల్లి సత్యవతి అధ్యక్ష బాధ్యతలను, రికార్డులను పేడాడకు అందజేశారు. ఈ సందర్భంగా పేడాడ మాట్లాడుతూ. జిల్లాలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న బడుగు బలహీనర్గాలకు గొంతుగా పార్టీ శ్రేణులు వ్యవహరించాలని తెలిపారు. జిల్లాలో పార్టీ నిర్మాణానికి, అభివృద్ధికి చేయాల్సిన కార్యక్రమాల్ని తీర్మానించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలను, సూచనలు, సలహాలను సేకరించారు. కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శులు సనపాల అన్నజి రావు, పైడి నాగభూషణ రావు, కోత మధుసూదన్ రావు, హెమరావు చౌదరి, దుప్పట్ల మధుసూదన రావు, దేసెళ్ల గోవింద మల్లిబబు, రెళ్ళ సురేష్, కేవిఎల్ఎస్ ఈశ్వరి, చింతాడ దిలీప్, కొత్తకోట సింహాద్రి నాయుడు, లకినేని నారాయణ రావు, బస్వ షణ్ముఖ రావు, లుకాలపు సింహాచలం, బొచ్చ రమణ, శ్రీరంగం సురేశ్, తెంబూరి మధుసూదన్ రావు, వి.శాంతారావు, పురుషోత్తం యాదవ్, మంత్రి నరసింహమూర్తి, యెస్. స్యమసుందర రావు, బెరీ వెంకట రావు, ఆబోతుల వెంకట్ నాయుడు, కొత్తకోట లక్ష్మి, బాబురావు, పీజే నాయుడు, సిహెచ్ గంగయ్య, రాంప్రసాద్, లక్కీనేని సాయిరాం, కవిటి గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.