Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

శ్రీనివాసరావుమృతి విశాలాంధ్ర పత్రికకు తీరనిలోటు

విశాలాంధ్ర – పార్వతీపురం: విశాలాంధ్ర పార్వతీపురం మండలం గ్రామీణ రిపోర్టర్ జన్నేటి శ్రీనివాసరావు(45) అకాలమృతి పార్వతీపురం మన్యంజిల్లా పత్రికారంగానికి, విశాలాంధ్ర దినపత్రికకు తీరనిలోటని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాప్రతినిధులు,ప్రజాప్రతినిదులు,
శ్రేయోభిలాషులు, వివిధపార్టీలనేతలు, వివిధ సంఘాల నేతలు విశాలాంధ్ర రెండు జిల్లాల రిపోర్టర్లు అన్నారు. విశాలాంధ్ర రిపోర్టరుగా, పార్వతీపురం సాంకేతిక కళాశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీనివాసరావు సోమవారం ఉదయం స్థానిక జిల్లా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిన కొద్దిసేపటికే మరణించారు. ఆయన మరణించారన్న వార్త జిల్లాలో అందరినీ కలచివేసింది. ఆయన గత మూడేళ్ళ నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అందరితో సన్నిహితంగా ఉంటూ చివరినిమిషం వరకు క్యాన్సర్ వ్యాధి లేనట్లే ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించారు . ఆయన మృతి చెందారన్న సమాచారం తెలిసిన కొద్ది క్షణాల్లో జిల్లాకేంద్రంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఆసుపత్రి వద్దకు చేరుకొని పరామర్శ చేశారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే అలజింగి జోగారావు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాగ్దేవిలు కూడా వెంటనే విచ్చేసి శ్రీనివాసరావు మృతదేహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. శ్రీను చేసిన సేవలను వారు కొనియాడారు. శ్రీను కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే జోగారావు తెలిపారు.ప్రభుత్వ సాంకేతిక కళాశాల ప్రిన్సిపాల్,అధ్యాపకులు, సిబ్బంది కూడా ఆసుపత్రి వద్దకు చేరుకొని పరామర్శ చేశారు.అనంతరం ఆయన మృత దేహాన్ని స్వగ్రామం గరుగుబిల్లి మండలం ఉద్దవోలుకు అంబులెన్స్ లో తరలించే చర్యలు చేపట్టారు. ఉద్దవోలు గ్రామానికి శ్రీనివాసరావు మృతదేహాన్ని తరలించారన్న సమాచారాన్ని తెలుసుకొని మాజీ ఎమ్మెల్సీ, టీడీపి రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే,పార్వతీపురం టిడిపి నియోజకర్గ ఇంచార్జి బొబ్బిలి చిరంజీవులు, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, విశాలాంధ్ర బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణలు విచ్చేసి ఆయన మృత దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. జిల్లా కేంద్రంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, గరుగుబిల్లి, కొమరాడ, పార్వతీపురం రూరల్ మీడియా ప్రతినిధులు, విశాలాంధ్ర రెండు జిల్లాల రిపోర్టర్లు విచ్చేసి శ్రీనివాస రావు మృతదేహానికి నివాళుర్పించారు. శ్రీనివాసరావుకు నివాళులు అర్పించిన వారిలో టిడిపి నాయకులు గుంట్రెడ్డి రవి కుమార్, కొల్లి తిరుపతిరావు, బడే గౌరు నాయుడు, గొట్టాపు వెంకటనాయుడు, రెడ్డి శ్రీనివాసరావు,ప్రదీప్, జాగాన కార్తీక్ నాయుడు, బోను చంద్రమౌళి తదితరులున్నారు. సీపీఐ రెండు జిల్లాల నాయకులు పి.కామేశ్వరరావు కె. మన్మథ రావు, ఒమ్మిరమణ,జీవన్, బుడితి అప్పలనాయుడు, ఈవినాయుడు తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.సీపీఎం జిల్లా నాయకులు రెడ్డి వేణు,సన్యాసిరావు, సాంబమూర్తి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంఘం అధ్యక్షుడు సామల సింహాచలం, గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్, చైతన్య నోబెల్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు పెదపెంకి శివ ప్రసాద్, జిల్లా ఎన్ జి ఓ అధ్యక్షులు కిషోర్, జిల్లా ఇమ్మూనైజేషన్ అధికారి డాక్టర్ జగన్ మోహన్, ఏబిసిడబ్ల్యుఓ సాంబ మూర్తి, వివిధ వసతిగృహాల సంక్షేమ అధికారులు,పార్వతీపురం మండలంలోని వివిధ గ్రామాలసర్పంచులు, ఎంపీటీసీలు సంతాపం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img