Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

నిమ్మాడ ఎర్రం నాయుడు ఘాట్ వద్ద నివాళులర్పించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చంనాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు

విశాలాంధ్ర సంతబొమ్మాలి (శ్రీకాకుళం) : మాజీ కేంద్రమంత్రి, శ్రీకాకుళం జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు కింజరాపు ఎర్రన్నాయుడు 11వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కోటొమ్మాళి మండలము నిమ్మాడ గ్రామంలో ఉన్న ఎర్రంనాయుడు ఘాట్ వద్ద రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు టెక్కలి ఎమ్మెల్యే కీంజరాపు. అచెన్నాయుడు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు తో పాటు కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. గురువారం ఉదయం ఎర్రన్నాయుడు స్వగ్రామమైన నిమ్మడ గ్రామంలో ఘాట్ వద్ద కు కుటుంబ సభ్యులు, బంధువులు, సమేతంగా వెళ్లి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా. పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం నిమ్మడ గ్రామంలో కల ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంతబొమ్మాలి, కోటబొమ్మాలి, నందిగాం, టెక్కలి మండలాలతో పాటు, జిల్లాలో కల తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రన్ననాయుడు కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img