Friday, December 8, 2023
Friday, December 8, 2023

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి. ఎంఈఓ చిన్నవాడు

విశాలాంధ్ర సంతబొమ్మాలి.( శ్రీకాకుళం) విద్యార్థులు క్రీడల్లో రాణించాలని మండల విద్యాశాఖ అధికారి జలుమూరు చిన్నవాడు అన్నారు. మంగళవారం సంతబొమ్మాలి మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బాలుర పాఠశాల అవరణలో మండల స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థి స్థాయి నుంచి కబడ్డీ, కోకో వంటి పోటీల్లో పాల్గొని తమ సత్తాను చాటితే, భవిష్యత్తులో ఉన్నత స్థాయి పోటీల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఇప్పటికే మన జిల్లా నుంచి చాలామంది క్రీడాకారులు జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రాణించారని అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం మండలంలో కల వివిధ పాఠశాలలను నుంచి వచ్చిన విద్యార్థులు జట్లు మద్య కబడ్డీ పోటీలు. హోరా హోరీగా సాగాయి. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలు చెందిన పిఈటిలు, బీపీటీలు, డ్రిల్ మాస్టర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img