Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

నిరంతర ప్రయత్నంతోనే విజయం

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
మన్యంజిల్లాలో మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన
795ఉద్యోగాలకు 2500మంది నిరుద్యోగులు హాజరు

విశాలాంధ్ర,పార్వతీపురం/పార్వతీపురం టౌన్:  నిరంతరప్రయత్నం, శ్రమతోనే విజయం సాధ్యమని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు.శుక్రవారంనాడు మొదటిసారి పార్వతీపురం మన్యం జిల్లాలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీకళాశాలలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుచేసిన మెగాజాబ్ మేళాను అయన ప్రారంభించారు. ఈసందర్భగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టరు  మాట్లాడుతూ జాబ్ మేళాలో పదమూడు  కంపెనీలలో సుమారు 795 వివిధ కంపెనీల ఉద్యోగాలకు ఇంటర్యూలు నిర్వహిస్తుండగా 2500మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారన్నారు.  ఇందులో ప్రస్తుతం ఉద్యోగంవచ్చిన వారు సంతోషంతో ఉద్యోగంలో చేరి, మిగిలిన వారు నిరుత్సాహపడకుండా మరల ప్రయత్నం చేయాలన్నారు.  కార్యసాధనలో నిరతరం ప్రయత్నం చేయాలని, కష్టపడితే విజయం సొంతమవుతుందన్నారు. నిరుద్యోగులకు  ఉద్యోగాలు పొందుటకు  వారికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు కల్పించుటకు రాష్ట్రంలో 65 నియోజకవర్గాలలో  స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దానిలో భాగంగా  పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేటలలో ఈ కేంద్రాలు ఏర్పాటు చెస్తున్నట్లు తెలిపారు.  కంపెనీలతో అవగాహన ఏర్పాటుచేసుకొని వారికి వారి కంపెనీలలో ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యాలపై అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగఅవకాశాలు కల్పించటం ఈహబ్ ల ఉద్దేశ్యమని తెలిపారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు  నిబద్దత, నిజాయతీతో పనిచేసి మంచి స్థాయికి చేరాలన్నారు. ఉద్యోగ నిర్వహణలో యిబ్బందులు ఎదురైనా  వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలన్నారు.  చాలామంది ప్రముఖులు వారి జీవితాలను చిన్నస్థాయినుంచే ప్రారంభించారని గుర్తుచేసారు. జాబ్ మేళాలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కువ కంపెనీలు వస్తే  మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ జాబ్ మేళాలో సైనప్టిక్  కంపెనీలో ట్రైనింగు కెమిస్ట్ గా ఉద్యోగాలు పొందిన  గుమ్మలక్ష్మీపురం కడెమి కొత్తగూడకు చెందిన బి.ఎస్.సి. చదివిన బిడ్డిగ సురేష్, కొమరాడమండలం కోదులగుంప గ్రామానికి చెందిన  ఇంటర్మీడియెట్ చదివిన మోసూరు రాజశేఖర్ లకు నియామకపత్రాలుఅందజేసారు.
జిల్లా నైపుణ్య అభివృద్దిఅధికారి యు.సాయికుమార్ మాట్లాడుతూ  జాబ్ మేళాలు నిరంతరంనిర్వహిస్తామని, ఎక్కువమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు  కంపెనీలతో మాట్లాడి జాబ్ మేళాలు ఎక్కువకంపెనీలు వచ్చేటట్లు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్శన్ గౌరీశ్వరి, వైస్ చైర్ పర్శన్ రుక్మిణి,జిల్లా ఎంప్లాయివెుంటు అధికారి అరుణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల చలపతిరావు తదితరఅధికారులు పాల్గొని మాట్లాడారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img