Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఈఏడాది కూడా లచ్చయ్యపేట,బీమసింగిలో చెరకు క్రషింగ్ కష్టమే…

*సంకిలి కర్మాగారానికి తరలించేదిశగా ప్రజాప్రతినిధులు,అధికారులఆలోచనలు
*దసరాకు ఎన్ సి ఎస్ చెరకు రైతులబకాయిలు పూర్తిగా చెల్లింపు!

విశాలాంధ్ర-పార్వతీపురం: మన్యంజిల్లాతో పాటు విజయనగరం జిల్లాలోని లచ్చయ్య పేట ఎన్ సి ఎస్, బీమసింగి సహకార చక్కెర కర్మాగారాలలో గతఏడాది గానుగ నిలిపివేయగా ఈఏడాదికూడా చెరకు గానుగ ఈరెండుచోట్లనిలిపివేసి సంకిలి ప్యారీ చక్కెర కర్మాగారానికి చెరకు తరలించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని విశ్వసనీయసమాచారం. ఈరెండు చక్కెర కర్మాగారపరిధిలోని చెరకును రాజాం నియోజక వర్గంలోగల సంకిలిప్యారీ కర్మాగారానికి తరలించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.ఇప్పటికే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారని దసరా తరువాత అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.ప్రస్తుతం ఎన్ సి ఎస్ చక్కెర కర్మాగార పరిధిలోని దాదాపు లక్షాయాభై వేల టన్నుల చెరకు సాగులోఉంది. చెరకు రైతులకు 2019-20, 2020-21సీజన్లో యాజమాన్యం సుమారు 16.65కోట్లరూపాయలు బాకీఉండగా ప్రభుత్వం ఆర్ ఆర్ యాక్టు ద్వారా ఇంతవరకు దాదాపు 70శాతం బకాయిలు చెల్లించగ ఇంకా మిగిలిన 1111మంది చెరకురైతులకు 3కోట్ల87లక్షల60వేల 894రూపాయల బకాయిలు చెల్లింపు చేయాల్సిఉంది.ఈబకాయిలు కూడా మరోవారంరోజుల్లో దసరా నాటికి చెల్లింపు చేయడానికి అధికారులుచర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కర్మాగారభూములు వేలంపాట పాడినవారు ఇంకాఆరుకోట్లరూపాయలను చెల్లించాల్సిఉందని,ఈనెలాఖరుకు వారు చెల్లిస్తారని అధికారులు చెబుతున్నారు.ఇదే సమయంలో ఆర్ ఆర్ యాక్టు ద్వారారైతులకు చెల్లింపుచేయగా మిగులు డబ్బులలో తమ పిఎఫ్ కోసంకూడా కొంతమొత్తాన్ని కేటాయించి ఆదుకోవాలని కార్మికులుకూడా పలుసార్లు జిల్లా కలక్టరుకు వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈకర్మాగార పరిధిలోని కార్మికులకు యాజమాన్యం పిఎఫ్ క్రింద 3కోట్ల50లక్షలు, 37మంది కార్మికుల గ్రాట్యుటీ కోటి 20లక్షలు, ఎల్ ఐ సి,
జి ఎస్ ఎల్ ఐ, ఓటి, లీవ్ ఎన్ క్యాష్మెంటు తదితర చెల్లింపులు కోటిరూపాయలు కలిపి సుమారు ఆరుకోట్లరూపాయలు చెల్లించాల్సిఉందని కార్మికులు చెబుతున్నారు. దీంతోపాటు పత్రిక ప్రకటనలకు, వాణిజ్య పన్నుల శాఖకు,
జి ఎస్ టి కు కూడా కొంత చెల్లింపు చేయాల్సి వుంది. రైతులకు బకాయిలు చెల్లింపుజరిగాక మిగిలిన మూడు కోట్ల రూపాయలలో ఎవరికీ చెల్లింపు చేయాలన్నది రెండు జిల్లా కలక్టర్లు నిర్ణయంపై అదారపడి ఉంటుందిమరి.
రైతులబకాయిలు తీరుతున్నసమయంలో క్రషింగుపై రెండుజిల్లాలమంత్రులు, ప్రజాప్రతినిదులు, రెండుజిల్లాలకలెక్టర్లు ఉన్నతాధికారులు ఒక్కసారి దీనిపైసమీక్ష సమావేశంను నిర్వహించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని రైతులు, రైతుసంఘాల నేతలు కోరుతున్నారు. లచ్చయ్యపేటలో సాంకేతిక సమస్యలతో క్రషింగు వేయలేక  సంకిలి ప్యారీకర్మాగారానికి తరలిస్తే
ఈప్రాంతంలో చెరకు కొనుగోలుకేంద్రాలు ఏర్పాటుచేసి తరలించాలని వారంతా కోరుతున్నారు. రైతులు దళారులబారిన పడకుండా తగుచర్యలు తీసుకోవాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు.
కార్మికులను మోసం చేస్తున్న ఎన్ సి ఎస్ యాజమాన్యం: కర్మాగారంలో పనిచేస్తున్న రెగ్యులర్, సీజనల్, రోజువారీ కార్మికులను అన్ని విధాలుగా ఎన్ సి ఎస్ యాజమాన్యం మోసం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో వారికి వివిధరకాల బకాయిలు సుమారు ఆరుకోట్ల రూపాయలు చెల్లింపులు చేయాల్సి ఉండగా గతఏడాది గానుగను కూడా నిలిపివేసిన యాజమాన్యం ఇటీవల వారిలోరకరకాల ఆశలుచూపి మరలా కర్మాగారానికి రప్పించారు. కర్మాగారంలో చెరకు క్రషింగు చేస్తామని, ఎన్ ఎస్ టి ఎల్ వారు వేతనాలు ఇస్తారని గతమూడు నెలల నుంచి చెబుతున్నారు. వారిని ఆశలుచూపి మోసంచేయడంతప్ప వారిని యాజమాన్యం ఆదుకున్నతీరు కనిపించడం లేదు. ఇదిలాఉండగా గత ఏడాదిగా విద్యుత్ బకాయిలు చెల్లించక పోవడంతో విద్యుత్ ను కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా కర్మాగారాన్ని నమ్ముకున్న కార్మికుల వేదన రోదన వర్ణనాతీతం 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img