Monday, October 3, 2022
Monday, October 3, 2022

జిల్లాఆసుపత్రిలో దుప్పట్లు, పండ్లు, రొట్టెలు అందజేసిన సురగాల

విశాలాంధ్ర,పార్వతీపురం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారంనాడు జిల్లాఆసుపత్రిలో కేకునుకోసి మోడీకి జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు.  బీజేపీమన్యం జిల్లానేత, రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి సురగాల ఉమా మహేశ్వరరావు అధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాగ్దేవి, ఇతర వైద్యులు, వైద్యసిబ్బంది, రోగుల బందువులు పెద్దఎత్తున పాల్గొన్నారు.ఆనంతరం ఆస్పత్రిలోని రోగులకు పండ్లు,రొట్టెలు, దుప్పట్లను అయన చేతుల మీదుగా అందజేసారు.ఈసంధర్భంగా ఆయన మాట్లాడుతూభారతదేశమంతట
ఈరోజున పెద్దఎత్తున వివిధ సేవా కార్యక్రమాలు చేయడంజరుగుతుందని, అందులోభాగంగానే మెగారక్తదాన శిబిరాలు పలుచోట్ల ఏర్పాటుచేశారని చెప్పారు. అక్టోబర్2వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కేంద్రం అమలుచేస్తున్న సంక్షేమపథకాలను వివరిస్తూ వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ఈకార్యక్రమంలో బిజెపి నాయకులు పలువురు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img