Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఘనంగా జరుగుతున్న స్వామివారి దశమ ఉత్సవాలు

నేడు సారె క్రింద 58రకాల స్వీట్లు దేవునికి సమర్పణ

విశాలాంధ్ర – సీతానగరం : మండల కేంద్రంలోని సువర్ణముఖినదీ తీరానగల  రుక్మిణీ సత్యభామసమేత శ్రీవేణుగోపాల స్వామిదేవాలయంతో పాటు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలలో దశమ వార్షిక మహోత్సవములు రెండోరోజు బుదవారంనాడు ఘనంగా జరిగాయి.
బుధవారంనాడు నిత్యారాధనం, అగ్నిప్రతిష్ఠ, పతాకప్రతిష్ఠ తీర్ధప్రసాద గోష్ట, సుదర్శన నారసింహయాగం తీర్ధ ప్రసాద గోష్ట, నిత్య హోమములను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.గురువారం నిత్యారాధనం, నిత్య హోమములు, తీర్థ ప్రసాదగోష్ట, శ్రీవేణుగోపాలస్వామి, శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, తీర్ధ ప్రసాదగోష్ట ఉంటాయని అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు తెలిపారు.దీంతో పాటు గురువారం సాయంత్రం ఆలయ నిర్వహకులు చెలికాని వెంకటగోపాలకృష్ణ భారతి దంపతులు 58రకాల స్వీట్లతో కూడిన సారెను దేవునికి అందజేస్తారని అర్చకులు పీసపాటి తెలిపారు.ఈకార్యక్రమంకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి దేవుని ఊరేగింపును కోలాటం, మందుగుండు సామగ్రితో గణంగా అన్ని వీదుల్లో నిర్వహించారు.దేవాలయ ప్రాంగణమును, గుడిలోపల, గుడి వెలుపల విద్యుద్దీపాలతో అలంకరణ చేపట్టారు. దశమ వార్షికోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులువచ్చిపూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈకార్యక్రమంలో తనతోపాటు ఆమంచి శ్రీనివాసాచార్యులు, పీసపాటి రామాను
జాచార్యులు, కె.మురారి,బృందావనం ఉదయ కృష్ణమాచార్యులు, శ్రీనివాసా చార్యులు పాల్గొని పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img