Monday, September 26, 2022
Monday, September 26, 2022

టిడిపి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి

కుటిల రాజకీయాలు తో అధికారం చేపట్టడమే చంద్రబాబు నాయుడు కు పని
ప్రతిపక్ష పార్టీ గా టీడీపీ విఫలం
రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన

విశాలాంధ్ర -శ్రీకాకుళం: ఎంపీ గోరంట్ల మాధవ్ విషయం లో టిడిపి అదే పనిగా రాద్దాంతం చేయట మే పనిగా పెట్టుకుంది అని, వ్యక్తి గత విషయం మీద టీడీపీ రాజకీయ లబ్ది కోసం దిగజారుడు రాజకీయాలు చేయటం మానుకోవాలి అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్థానిక అర్ అండ్ బీ అతిథి గృహం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో వైసీపీ అధికారం లోకి వచ్చాక ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలు నుంచి వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న విశ్వాసం చూసి ఓర్వలేక వైసీపీ మీద బురద జల్లాలి అని చంద్రబాబు నాయుడు కుతంత్రాలు పన్నుతున్నారని, కుటిల రాజకీయాలు చేయటం లో బాబు దిట్ట అని, ఇలానే నమ్ముకున్న వారిని కూడా మోసం చేసి , అప్రతిష్ట పాలు చేసి అధికారం పొందడం బాబు కు అలవాటు అన్నారు. అధికారం కోసం బాబు ఎంతకైనా దిగ జారు తారన్నారు. బాధితులు ఎవరూ లేని ఘటన లో టిడిపి ఆరోపణలు వారి కుటిల రాజకీయాలకు అద్దం పడుతుందన్నారు. రాష్ట్రం లో ప్రభుత్వం పై చెప్పడానికి ఎలాంటి వ్యతిరేక విషయాలు లేకపోవడం వలన ఇలాంటి అనవసర రాద్దాంతం చేస్తున్నారన్నారు. మహిళలకు రాష్ట్రం లో రక్షణ లేదు అని, మహిళా వ్యతిరేక ప్రభుత్వం అని టీడీపీ అనటం హాస్యాస్పదం అన్నారు. వైసీపీ ప్రభుత్వం ముందు నుంచి మహిళల అభ్యున్నతికి, ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేస్తుందని, మహిళ లో వైసీపీ మీద మంచి నమ్మకం ఉందని టీడీపీ ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తప్పు ఎవరు చేసినా జగన్ మోహన్ రెడ్డి ఉపే క్షించరు అని, నిజంగా తప్పు చేస్తే వారు శిక్షను అనుభవిస్తారని, వ్యక్తిగత విషయం మీద రాద్దాంతం చేయటం ఇప్పటికైనా మానుకోవాలి అని హితవు పలికారు. 2014 ఎన్నికల్లో బాబు మహిళల రుణాలు మాపీ చేస్తా అని గద్దె నెక్కీ, వాటి ని మపీ చేయక పోవటం తో వైసీపీ అధికారం లోకి వచ్చాక వాటిని మాఫీ చేసింది అని, మహిళా సాధికారతే వైసీపీ లక్ష్యం అని, మహిళల రక్షణకు దిశ చట్టం తీసుకు వచ్చిన ప్రభుత్వం వైసీపీ అన్నారు. ఇప్పటికైనా టీడీపీ కుటిల రాజకీయాలు మానుకుని ప్రతి పక్ష పార్టీ గా బాధ్యతగా మెలగాలి అని, ఒక వేళ నిజంగా ప్రజల సమస్యలు ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తే ఆనంద పడి వాటికి పరిష్కారం చేస్తాం అని, టీడీపీ ముందు వారి ప్రతిపక్ష బాధ్యత ను మంచిగా నిరవరించాలని అన్నారు. ప్రతిపక్షంగా టీడీపీ పూర్తిగా విఫలం అయ్యింది అని, వారికి అధికారం మీద ఉన్న మోజు ప్రజల మీద లేదన్నారు. అధికారం కోసం అనవసర విషయాల మీద రాద్దాంతం చేయటం మానుకోవాలి అని, టీడీపీ ఎన్ని కుతంత్రాలు పన్నినా వైసీపీ మీద ప్రజల కు ఉన్న నమ్మకాన్ని పోగొట్టలేరు అని, టీడీపీ ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేస్తే వచ్చే ఎన్ని కల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతారు టీడీపీ తప్పుడు ఆరోపణలు, ప్రచారాలకు వైసీపీ తలోగ్గేదే లేదు అని, అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే వైసీపీ అజెండా అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img