Friday, April 19, 2024
Friday, April 19, 2024

పదోతరగతి విద్యార్థులు ఉత్తమ పలితాలు సాధించాలి

విశాలాంధ్ర – సీతానగరం: పదో తరగతి విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉత్తమ పలితాలు సాధించాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, మన్యం జిల్లా పంచాయతీ రాజ్ శాఖ కార్యనిర్వహణ అధికారి డాక్టర్ ఎంవిఆర్ కృష్ణాజీ పిలుపు నిచ్చారు. శుక్రవారం మండలంలోని నిడగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదోతరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలలో విజయం సాధించడానికి కావాల్సిన పలు అంశాలతో పాటు వారి తల్లిదండ్రులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులే ఉన్నత పలితాలు సాధించి, ఉన్నత స్థానాల్లో ఉంటున్న తీరును వివరించారు. విధ్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం అవసరాన్ని కూడా తెలుసుకోవాలన్నారు. పోటీ ప్రపంచంలో పోటీకి తగ్గట్టుగా చదివి ముందుండాలని తెలిపారు. వెనుకబడిన విధ్యార్ధులు కూడా కష్టపడితే ఉత్తమ పలితాలు సాధించడం సులభమన్నారు. జనవిజ్ఞాన వేదిక కార్యక్రమాలు గూర్చి కూడా వివరించారు. ఈకార్యక్రమంలో పంచాయతీ రాజ్ డిఈ ఎం. చంద్రమౌళి, ఉన్నత పాటశాల ప్రదానోపాద్యాయులు మరడాన శివున్నాయుడు, ఎస్ ఎం సి ఛైర్మన్ వెన్నెల తిరుపతిరావు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సిబ్బంది,విధ్యార్ధులు పాల్గొన్నారు. తమ పాఠశాలకు విచ్చేసి విలువైన సూచనలు, సలహాలు ఇచ్చిన డాక్టరు కృష్ణాజీ,చంద్రమౌళిలను ఘనంగా సత్కరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img