Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అభ్యర్థి గెలిచారు.. పార్టీ ఓడింది !

స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నర్తు రామారావు విజయం

విశాలాంధ్ర – శ్రీకాకుళం : జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల లో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించారు. ఎన్నికల నోటిఫికేషన్ నాడే ఎమ్మెల్సీ రామారావు విజయం సాధిస్తారు అని అందరికీ తెలిసిందే. ఏకగ్రీవం అవ్వాల్సిన దానిని జిల్లా వైసీపీ నాయకులు ఎన్నికల వరకూ తెచ్చుకున్నారు అనటం లో సందేహం లేదు. వైసీపీ అభ్యర్థిగా రామారావు విజయం సాధించినా పార్టీ మాత్రం వెనుక పడింది అనటం లో సందేహం లేదు. ప్రతిపక్ష టీడీపీ సహకారం లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆనెపు రామకృష్ణ కులం కోసం ముందుండి పోరాడారు అని చెప్పాలి. కాపులకు అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశం లో తూర్పు కాపులు అనెపును బలపరచి ఎన్నికల్లో నిలబెట్టారు. అధికార పార్టీ నీ ఎదిరించి పోటీ చేస్తున్న ఆనెపు ను సహకారం చెయ్యాల్సిన టీడీపీ నాయకులు చెయ్యలేదు అనినే చెప్పాలి. దానికి నిదర్శనం టెక్కలి, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే లు తో పాటు శ్రీకాకుళం ఎంపీ లు ఓటు హక్కు ఉన్నప్పటికీ ఓటు ను వినియోగించ కపోవటం. జిల్లా లో మొత్తం ఓట్లు 779 ఉండగా అందులో అన్ని కలుపుకుని 86 ఓట్లు టీడీపీ వి మిగిలినవి వైసీపీ వి. 752 ఓట్లు పోలవగా న ర్తు రామారావుకు 632 ఓట్లు రాగా, ఆనెపు రామకృష్ణ కు 108 వచ్చాయి. 12 ఓట్లు చెల్లలేదు. టీడీపీ పోటీ చెయ్యలేదు కనుక రాష్ట్రం లో అధికారం లో వైసీపీ ఉన్నప్పుడు అన్ని ఓట్లు వైసీపీ కి పడాలి. కానీ జిల్లా లో టిడిపి కి ఉన్న ఓట్ల కన్నా ఆనెపుకు ఎక్కువ ఓట్లు రావటం మాత్రం వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ఒక కారణం అని కూడా జిల్లాలో వినిపిస్తున్న మాట. జిల్లా లోని టీడీపీ నాయకులు కొందరు ఆనెపు కు సహకారం అందించలేదు కానీ ఆయనకు వైసీపీ నుంచి కూడా ఓట్లు రావటం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ గా నర్తూ రామారావు విజయం సాధించినా వైసీపీ ఒడినట్లే అని, ఆనెపు రామకృష్ణ అధికార పార్టీ నాయకుల పైరవీలు కు లొంగకుండా నిలబడటం కూడా మంచి నిర్ణయమే అని జిల్లా ప్రజలు అనుకుంటున్నారు. ఆనెపు కు పూర్తి స్థాయి లో టీడీపీ నాయకులు సహకారం అందిస్తే మరిన్ని ఓట్లు వచ్చేవి అని అంటున్నారు. వైసీపీ భారీ మెజార్టీ తో విజయం సాధించిందని నాయకులు అనటం హాస్యాస్పదంగా ఉందని, అధికార పార్టీ కి ఉన్న ఓట్లే పడనప్పుడు అభ్యర్థి గెలిచినా పార్టీ ఓడినట్లే అని జిల్లా వాసులు అంటున్నారు. నర్తు రామారావు కనుక ఆయన సౌమ్యుడు గా పేరుంది కనుక ఇన్ని వచ్చాయి అని కాకుంటే అధికార పార్టీ ఓట్లు మరికొన్ని పోయేవి అని కూడా అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img