Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి, జడ్పీచైర్మనులు

కందులపదంలో గడప గడపకు కార్యక్రమం

విశాలాంధ్ర,పార్వతీపురం/సాలూరు : మన్యం జిల్లాలోని సాలూరు మండలంలో కందులపదం గ్రామంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావుతో కలిసి రూ.35 లక్షలతో నిర్మించిన గ్రామసచివాలయం భవనం, వంతెనను ప్రారంభించారు. శనివారం ఈగ్రామంలోనే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. వారిద్దరు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గడప గడపకు వెళ్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను పెద్దఎత్తున చేస్తున్నట్లు తెలిపారు. మండలంలో దాదాపు ఐదురహదారులు నిర్మించాల్సి ఉందని, వాటికిచర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు చెప్పినవి ప్రభుత్వం చేస్తోందని, రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా పథకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో సాలూరు మండలప్రజా ప్రతినిధులు, అధికారులు,సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img