Monday, March 20, 2023
Monday, March 20, 2023

సీతంరాజు సుధాకర్ కు మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలి

విశాలాంధ్ర,సీతానగరం : వైఎస్సార్సీపీ తరుపున ఉత్తరాంధ్ర శాసన మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ కు  మొదటిప్రాదాన్యత ఓటువేసి అత్యదిక మెజారిటీతో గెలిపించాలని మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు.గురువారం సాయంత్రం ఎమ్మెల్యే జోగారావు అదేశాలు మేరకు మండల పరిధిలోని ఏర్పాటు చేసిన నాయకులంతా కలిసి మండలంలోని చినఅంకలం, సుభద్ర సీతారాంపురం, ఆవాలవలస, గారెల వలస, జానుమల్లువలస, కోట సీతారామ పురం, రంగమ్మపేట తదితరగ్రామాల్లో పట్టభద్రులను ఉద్యోగ సంఘాల నాయకులు,ఉపాధ్యాయ నాయకులు, పదవీవిరమణ ఉద్యోగులు,కళాశాలలో పాఠశాలల్లోపనిచేస్తున్న సిబ్బంది, నిరుద్యోగ పట్టభద్రులను కలిసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలోమాజీ జెడ్పీ చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, మండలవైఎస్ఆర్సీపీ అద్యక్షుడు బొంగు చిట్టిరాజు, ఎంపీపీ ప్రతినిధి బలగ శ్రీరాములు, జెడ్పీటీసీబాబ్జి, మండల నేతలు అర్వీ పార్థసారథి,రత్నాకర్, ఈశ్వర నారాయణ, అంబటి కృష్ణంనాయుడు, తెంటు వెంకటఅప్పలనాయుడు, గాజాపు శ్రీనివాసరావు, బుడితి గౌరునాయుడు , యు సురేష్,శివ, ఆయాగ్రామాలలో ఉండే ప్రజా ప్రతినిదులు,నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img