Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

సీతానగరం మండలంలో రెప రెపలాడిన మువ్వనల జెండా 

విశాలాంధ్ర, సీతానగరం: మండలంలోని ఆన్నిప్రభుత్వ కార్యాలయాల్లో, సచివాలయాల్లో, విద్యాసంస్థలలో పలు చోట్ల 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి బలగ రవనమ్మశ్రీరాములు నాయుడు జెండాను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ బాబ్జీ, ఎంపిడిఓ ప్రసాద్, ఈఓపిఆర్డి వర్మ, వెలుగు ఏపిఎం శ్రీరాములునాయుడు, గృహ నిర్మాణ శాఖ జేఈ జానకీరాం, ఆర్డబ్ల్యుఎస్ జేఈ పవన్ కుమార్, ఏపిఓ నాగలక్ష్మి వివిధశాఖల ఉద్యోగులు,ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ షేక్ ఇబ్రహీం, పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ నీలకంఠం, పి హెచ్ సిలో వైద్యులు శిరీష, నీలిమలు, స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంఛార్జి ప్రిన్సిపాల్ తెర్లి రవికుమార్ , జెడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్ ఎం ఇళ్లా ప్రసన్నలక్ష్మీల అధ్వర్యంలో ఘనంగా జెండా పండుగను నిర్వహించారు.బూర్జలో మాజీ జెడ్పీ చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, పెదంకలంలో ఎంపిపి బలగ రవనమ్మ, లచ్చయ్యపేటలో జెడ్పీటీసీ బాబ్జీ, మరిపి వలసలో మాజీ ఎంపిపి బొంగు చిట్టిరాజు, బల్లక్రిష్ణాపురంలో మాజీ సిడిసి ఛైర్మన్ నడిమింటి రామకృష్ణ, నిడగల్లులో వైస్ చైర్మన్ సూర్యనారాయణలతోపాటు గ్రామ పంచాయితీలో, పాటశాలలో సర్పంచులు జెండాలను ఎగురవేశారు. పెదంకలం పి హెచ్ సి లో వైద్యులు రాధాకాంత్,
జోగమ్మపేట ప్రతిభా కళాశాలలో ప్రిన్సిపాల్ పోల వెంకటనాయుడు, సాంఘీక సంక్షేమ కళాశాలలో ప్రిన్సిపాల్ ఈశ్వరరావు, కెజిబివిలో స్పెషల్ ఆఫీసర్ గొట్టాపు హరిత  అధ్వర్యంలో నిర్వహించారు. పెదబోగిలి మేజర్ గ్రామపంచాయితీలో సర్పంచ్ జొన్నాడ తేరేజమ్మ జెండాను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీలు గౌరీకిరన్, బురిడీ సూర్యనారాయణ, ఉపసర్పంచ్ అరవింద్, ఈఓ వెంకటరావులతోపాటు వార్డు సభ్యులు, గ్రామపెద్దలు, రెండు సచివాలయాల ఉద్యోగులు పాల్గొన్నారు. గుచ్చిమిలో సర్పంచ్ మర్రాపు శ్రీదేవి, జోగమ్మపేటలో సింహాచలం, చినబోగిలిలో కురమాన శ్రీనివాసరావు, కాసాపేటలో తేలు దనంజయమ్మ, అంటిపేటలో సిరికి మహేష్ , గాదెలవలసలో బొన్నాడ తిరుపతిరావు, బక్కుపేటలో గొట్టాపు అప్పారావు, కృష్ణరాయపురంలో గునుపూరు అన్నంనాయుడు, పెదంకలంలో బలగ శ్రీనివాసరావు, గెడ్డలుప్పిలో తిరుపతిరావు, కొత్తవలసలో అనితఅప్పలనాయుడు, తామరఖండిలో సర్పంచ్ లలితవెంకటనాయుడు, చెళ్లంనాయుడువలసలో వాకాడ అప్పయమ్మ, లక్ష్మిపురంలో వెంకటరమణ, వెంకటపురంలో బుడితి శ్రీనివాసరావు, ఇప్పలవలసలో చింతల లక్ష్మణరావు, పాపమ్మవలసలో గౌరునాయుడు తదితర గ్రామాల్లో ఆయా సర్పంచులు జెండాను ఎగురేశారు. జానుమల్లువలస గ్రామంలోని అమృత్ సర్ వద్ద సర్పంచ్ యాళ్ళ వెంకటనాయుడు, కృష్ణ రాయపురం గ్రామంలోని అమృత్ సర్ కోనేరువద్ద సర్పంచ్ గునుపూరు అన్నం నాయుడులు జెండాను ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img