Monday, October 3, 2022
Monday, October 3, 2022

స్వాతంత్య్ర ఫలాలు నేటికీ సామాన్యులకు దూరం

  • బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీపీఐ పోరాటాలు
  • సీపీఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి

స్వాతత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా వాటి ఫలాలు మాత్రం సామాన్యులకు అందటం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి పురస్కరించుకుని సోమవారం స్థానిక ఎన్ అర్ దాసరి క్రాంతి భవన్ ( సీపీఐ జిల్లా కార్యాలయం) అవరణలో మువ్వన్నెల జెండా ను శ్రీరామ్మూర్తి ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెల్ల దొరల కబంధ అస్తాల్లో నలిగిపోతున్న దేశ పౌరుల స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు బ్రిటీష్ పాలకుల లాఠీ దెబ్బలకు, తూటాలకు బలయ్యారు అని, ఎన్నో పోరాటాలు, మరెందరో మహను బావులు ప్రాణ త్యాగాలతో సాధించుకున్న స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా వాటి ఫలాలు కొందరి చేతుల్లోనే ఉన్నాయి అన్నారు. ఇప్పటికీ దేశం లో ఆకలి చావులు సంభవిచటం బాధాకరం అన్నారు. నేటికీ దేశంలో ఆర్థిక, సాంఘీక అసమానతలు ఉండటం నిత్యం చూస్తూనే ఉన్నాం అని, ఇలాంటి అసమానతలు పోయి, దేశం లోని ప్రతీ పౌరుడు గుడు, గుడ్డ, మూడు పూటలా కుడు దొరికి నప్పుడే నిజమైన స్వాంత్య్రం అన్నారు. దేశ పౌరులు అందరికీ అందాల్సిన స్వాతంత్ర ఫలాలు కొన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లోనే ఉన్నాయి అని, దీని కి కారణం మనల్ని పాలిస్తున్న పాలకులే కారణం అన్నారు. దేశంలో యువత స్వాతంత్ర పోరాటాలు తెలుసుకుని, ప్రతీ పౌరుడు స్వతంత్ర స్ఫూర్తి తో, దేశ రక్షణ కోసం , దేశ పౌరుల హక్కుల కోసం ముందుడాలి అని పిలుపు నిచ్చారు. స్వాతంత్య్రం రాక మునుపు నుంచి స్వాతంత్ర సంగ్రామం లో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారు అని, స్వాతంత్ర అనంతరం కూడా వాటి ఫలాలు దేశ పౌరులు అందరికీ అందాలి సీపీఐ నిరంతర పోరాటాలు చేస్తుంది అని, బడుగు బలహీనర్గాలకు అండగా, సామాన్యుల హక్కుల కోసం, వారి పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటుంది అన్నారు . ఈ కార్యక్రమం లో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్. వెంకటరావు, శ్రీకాకుళం నగర కార్యదర్శి , సహాయ కార్యదర్శి లు డో ల శంకర రావు, ఏ ఐ టీ యూ సీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనపాన షణ్ముఖ రావు, డీ హెచ్ పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి య డ్ల గోపీ, ఉపాధ్యక్షు లు బలగ రామారావు, మహిళా సమాఖ్య నాయకురాలు పట్టా ప్రభావతి, ఏ ఐ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస రావు, సీపీఐ నాయకులు నిమ్మాడ కృష్ట, చిం తు ఎరయ్య, చుక్క వెంకటరావు, , నాగ వంశం త్రినాథరావు, ఏ ఐ టీ యూ సీ నాయకులుపంచిరెడ్డి అప్పారావు, ఉప్పాడ సూర్యనారాయణ, విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ రవి, సీపీఐ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img