Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ముమ్మరంగా వాహనాలను తనిఖీలు చేస్తున్న పోలీసులు


విశాలాంధ్ర,సీతానగరం: సెప్టెంబరు 1న మిలీనియం మార్చ్ పేరిట ముఖ్యమంత్రి ఇళ్లుముట్టడికి సిపీఎస్ ఉద్యోగులు పిలుపునివ్వగా దాన్నిఅడ్డుకునేందుకు పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఆదివారం విశాఖ వైపువెళ్ళే ఆన్నిరకాలవాహనాలను ఎస్ ఐ నీలకంఠం ఆధ్వర్యంలో స్థానిక రాష్ట్ర రహదారిపై తనిఖీలు నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీతానగరం హనుమాన్ కూడలి వద్ద చెక్ పోస్టునుకూడా పెట్టి 24గంటలపాటు పోలీసులు షిఫ్టుల్ల వారీగా విధులు నిర్వర్తిస్తూ వాహనాలు తనిఖీలు చేస్తున్నారు.ఇప్పటికే సెక్షన్ 149 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం  ఉద్యోగులకు నోటీసులు ఇచ్చి బైండోవర్ కేసులను నమోదుచేసిన పోలీసులు అడుగడుగునా తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలపై కూడా నిఘా పెట్టారు. సీఎం ఇళ్లు ముట్టడికార్యక్రమం భగ్నంచేసేందుకు ఆన్నిచర్యలను పోలీసు అధికారులు చేపడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే మన్యం జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ గ్రామ స్థాయినుండి జిల్లాస్థాయిలో
ఏఉద్యోగి సెప్టెంబరు1న సిఎల్ పెట్ట రాదని, సిఎల్ మంజూరుచేయవద్దని ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగులు కూడా ఆలోచనలో పడటం స్పష్టంగా కనిపిస్తుంది. ఈనెల 31న జరుగనున్న వినాయక చవితిపండుగ కంటే సెప్టెంబర్ 1న జరుగనున్నకార్యక్రమం గూర్చే అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు

ముమ్మరంగా వాహనాలను తనిఖీలు చేస్తున్న పోలీసులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img