Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్లలో ఉండే హమాలీల సమస్యలను పరిష్కారం చేయాలి

 • డీలర్ల డిపోలవద్ద దించే
  బియ్యం వగైరా సరుకులకు దింపుడు కూలీ ఇప్పించాలి
  *కదం తొక్కిన హమాలీలు

  విశాలాంధ్ర,పార్వతీపురం/బెలగాం: మన్యం జిల్లాలోని హమాలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని 8 ఎంఎల్ఎస్ పాయింట్ల హమాలీలు పెద్ద ఎత్తున తరలివచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.సోమవారం స్పందన సందర్భంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా హమాలీల గౌరవ అధ్యక్షులు పి. కామేశ్వరరావు, ఏ ఐ వై ఎఫ్ నేత బిటినాయుడు, హమాలీల యూనియన్ అద్యక్షులు నిమ్మక ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రాగోలు దుర్గా ప్రసాద్ ఆద్వర్యంలో ధర్నాచేసి, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్, జిల్లా సివిల్ సప్లై డిఎం నాయక్ లకు వినతి పత్రాలను అందజేశారు. గతనెల 20నుండి డీలర్ల డిపోలవద్ద సరుకుదించే బాధ్యత తమకు సంబంధం లేకపోయినప్పటికీ జిల్లాఅధికారుల కోరిక మేరకు డీలర్లకు ,కార్పొరేషన్ కు మధ్యవున్న వివాదం కారణంగా ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేసే హమాలీలచే దిగుమతి చేయించటం జరిగిందన్నారు. దీనికి సంబంధించిన కూలీ విషయంలో ఎండి, డిఎస్ఓ మీరు హమీఇవ్వటం మూలంగా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పేదలకు ఇబ్బంది లేకుండా హమాలీలు పనిచేయటం జరిగిందన్నారు. మాకు ఎగుమతి, దిగుమతికి క్వింటాళ్లుకు రూ.25/-లు ఇస్తున్నారని,డీలర్ల వద్ద దింపేదానికి క్వింటాళ్లుకు రూ.12.50 ఇవ్వవలసియున్నదని,దీనిని ఈనెల వేతనాల బిల్లులో వేయించవలసినదిగా డిమాండ్ చేశారు.లేని యెడల ఈనెల 20 నుండి జరగబోయే సరుకుల మూమెంటులో అన్లోడింగ్కు వెళ్ళమని తెలిపారు.హమాలీలకు రావలసిన ఏరియర్స్, స్వీటు ప్యాకెట్లు, డిఫరెన్స్ ఎమౌంట్, యూనిఫామ్ కుట్టుకూలి, స్వీపర్కు ఏరియర్స్ తక్షణమే ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పనిమానేసిన, చనిపోయిన వారందరికీ పిఎఫ్ డబ్బులు తక్షణమే ఇప్పించాలని, ఎంఎల్ఎస్ పాయింట్లలో రెస్ట్ రూం, త్రాగునీరు సౌకర్యం తక్షణమే కల్పించాలన్నారు. స్టేజ్-2 ద్వారా కాకుండా మిల్లర్లే వారి మిల్లుల నుండి లేదా వారి ఏజన్సీల ద్వారా చౌకధరల డిపోలకు
  సరకులను సరఫరా చేయడానికి గానూ ఈనెల 17న ఎండి సివిల్ సప్లయి కార్పొరేషన్ వారు పిఆర్ఓసీ/1/2022-23 ద్వారా టెండర్ పిలిచియున్నారని,
  ఈటెండరు విధానం వలన రాష్ట్రవ్యాప్తంగా
  5వేలకుటుంబాలు రోడ్డునపడే ప్రమాదం ఉన్నదన్నారు.. కావున సదరు టెండరు నోటీసును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈడిమాండ్ల సాధనకోసం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పారు.ఈకార్యక్రమంలో వారితో పాటు పార్వతీపురం,పాలకొండ,సీతంపేట, పాచిపెంట, గుమ్మలక్ష్మిపురం,మక్కువ, కురుపాం, సాలూరు ఎం ఎల్ ఎస్ పాయింట్లకు చెందిన పకీర్,గోవింద్,అప్పారావు, పడాల ప్రసాద్,చింతాడలవరాజు,సురేష్, కలిపిండి రాము, అప్పలనాయుడు, గౌరు నాయుడు, బిడ్డిక మురళి, నమ్మి కృష్ణ, చిన్ని గున్నయ్య, జి వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img