Friday, April 19, 2024
Friday, April 19, 2024

సైనికులు చేసిన త్యాగాలు మరువలేనివి

జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్

విశాలాంధ్ర – శ్రీకాకుళం: సైనికులు చేసిన త్యాగాలు మరువలేనివని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పేర్కొన్నారు. శనివారం సైనిక సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది మున్సిపల్ హైస్కూల్ మైదానం నుండి జిటి రోడ్డు మీదుగా కలెక్టరేట్ కార్యాలయంనకు ర్యాలీగా చేరుకున్నారు. ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సందర్భంగా 75 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సైనికులు దేశ సరిహద్దుల్లో రాత్రి పగలు దేశాన్ని కాపాడడం వలన దేశ ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారంటే సైనికుల వలనేనన్నారు. చిన్న దేశాలు పెద్ద దేశాలతో పోరాటం చేస్తున్నాయంటే అందుకు కారణం సైనికులేనన్నారు. ఈ సందర్భంగా వీర నారీమణులను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి పి. శైలజ, సిబ్బంది ఈశ్వరరావు, మురళి, గ్రూప్ కెప్టెన్ ఈశ్వరరావు, కల్నల్ మెండ నారాయణరావు, మాజీ సైనికుల అధ్యక్షుడు పూర్ణ చంద్రరావు, విశ్రాంత మిలటరీ ఆఫీసర్లు, నలుమూలల నుండి మాజీ సైనికులు, వీర నారీ మణులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img