Monday, September 26, 2022
Monday, September 26, 2022

సమర యోధులు చేసిన త్యాగాలు స్మరించాలి

జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్

విశాలాంధ్ర – శ్రీకాకుళం: స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న జిల్లా ఖజానా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదికా అమృత్ మహోత్సవ్ వివిధ కార్యక్రమాలు సంవత్సరం నుండి జరుపుకుంటున్నామన్నారు. గ్రామ స్థాయి నుండి దేశమంతా ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలు వలన ఈనాడు సేచ్ఛా వాయువులు పీల్చగలుగుతున్నామన్నారు. జిల్లాలో చరిత్ర గల భవనాలు, బౌద్ధ స్థూపాలు, దేవాలయాలు ఉన్నట్లు చెప్పారు. దేశ భక్తిని చాటి చెప్పాలన్నారు. ఇంటింట హర్ తిరంగ కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
హెల్పింగ్ హేండ్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలు పట్ల ఆయన అభినందించారు.
అనంతరం కబడ్డీ, టగాఫర్, క్రికెట్, బ్యాట్మింటన్, వాలీబాల్ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు జిల్లా కలెక్టర్ బహుమతులు అందజేశారు. అంతకు ముందు ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఖజానా శాఖ ఉప సంచాలకులు రవి కుమార్, ఎటిఓ సావిత్రి, ఎస్టీఓ కృష్ణారావు, ట్రెజరీ హెల్పింగ్ టీం డేవిడ్, బి శ్రీనివాసరావు, డివి సత్యనారాయణ, ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img