Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఈ గౌరవం శ్రీకాకుళానికే అంకితం


ఐజేయూ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు

విశాలాంధ్ర – శ్రీకాకుళం: భారత జర్నలిస్టు ఉద్యమ పితామహుడు మానుకొండ చలపతి రావు ( ఎంసి ) జన్మించిన మట్టికి ప్రతినిధిగా ,ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కార్యవర్గంలో తనకు స్థానం లభించినట్టు భావిస్తున్నానని,ఈ గౌరవం శ్రీకాకుళానికే అంకితమని నల్లి ధర్మారావు ప్రకటించారు .ఇటీవల చండీఘడ్ లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన ,కార్యవర్గ సభ్యుడిగా,ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత ,గురువారం శ్రీకాకుళం వచ్చిన సందర్భంలో ,స్థానిక క్రాంతి భవన్ లో వివిధ సంస్థలు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశాయి.సత్కారం తరువాత ఆయన మాట్లాడారు .1987లో,జిల్లాలో యూనియన్ శాఖ ఏర్పాటు నుంచి వివిధ స్థాయిల గుర్తింపు ,గౌరవాలను తమ నాయకత్వం ఇచ్చిందని,రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రకు తొలి అధ్యక్షునిగా ఎంపిక చేసిందని ధర్మారావు చెప్పారు.ఆ బాధ్యత తరువాత ,చిన్న,మధ్యతరహా వార్తా పత్రికల సంఘానికి అధ్యక్షునిగా ఎంపిక చేసిందన్నారు.అదే సమయంలో జాతీయ కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించిందని గుర్తు చేసుకున్నారు .నవ్యాంధ్ర నుంచి తొలిసారిగా ఈ గౌరవం దక్కిందని,చండీఘడ్ లో జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించిందని చెప్పారు.తనను జర్నలిస్టుగా ,జర్నలిస్టుల నాయకునిగా అంచెలంచెలుగా పెంచిన శ్రీకాకుళం మట్టికి దక్కిన గౌరవంగా భావిస్తూ,ఇది శ్రీకాకుళానికే అంకితమన్నారు.యూనియన్ కు విధేయంగా ఉంటూ,అవకాశవాదం తెలియకుండా పనిచేయడం ,దీనికీ కారణమన్నారు.తన ఉన్నతికి అడుగడుగునా సహకరించి,జాతీయ స్థాయిలో తనను నిలిపిన జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి ,ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు ,సెక్రటరీ జనరల్ బల్వీందర్ సింగ్ జమ్ము,పూర్వ అధ్యక్షులు దేవులపల్లి అమర్,సీనియర్ నాయకులు డి.సోమసుందర్ ,ఎ.సురేష్ కుమార్ ,రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు ఐవి సుబ్బారావు ,చందు జనార్థన్ లకు ధర్మారావు ధన్యవాదాలు తెలిపారు .యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్.ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ,సిపిఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి ,ఇస్కఫ్ రాష్ట్ర కార్యదర్శి సనపల నర్సింహులు ,అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతాడ కృష్ణారావు ,యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూన పాపారావు ,స్సామ్నా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంవి మల్లేశ్వరరావు ,యూనియన్ జిల్లా అధ్యక్షులు చింతాడ అప్పలనాయుడు ,ఇస్కఫ్ జిల్లా కార్యదర్శి జివి నాగభూషణ్,స్సామ్నా జిల్లా నాయకులు నవచైతన్య ,చౌదరి సత్యనారాయణ ,దుర్గుమహంతి రామారావు ,విశాలాంధ్ర బుక్ హౌస్ బ్రాంచి మేనేజర్ ఎచ్చెర్ల రవికుమార్ తదితరులు మాట్లాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img