Friday, April 19, 2024
Friday, April 19, 2024

“ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమానికి”అనూహ్య స్పందన

టీడీపి నేత వాడాడ రాము

విశాలాంధ్ర,పార్వతీపురం:తెలుగుదేశం పార్టీ జాతీయఅధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీపిలుపుమేరకు నియోజకవర్గంలో పలుగ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి”కార్యక్రమంకు అనూహ్య స్పందన లభిస్తుందని పార్వతీపురం నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ నేత వాడాడ రాము తెలిపారు. గురువారం ఆయన మండలంలోి జరిగిన ఇదేం ఖర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విశాలాంధ్రతో మాట్లాడారు.గత మూడున్నర ఏళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైపల్యం, ప్రజల్లో వ్యతిరేఖిత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. నియోజక వర్గం ఇంచార్జి బొబ్బిలి చిరంజీవులు, రాష్ట్రపార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ ద్వారపు రెడ్డి జగదీష్ ఆద్వర్యంలో నియోజక వర్గంలో గతంలో బాదుడే బాదుడు కార్యక్రమం ముమ్మరంగా చేయగా, నేడు ఇదేం ఖర్మ ద్వారా ప్రజలు నుండి గ్రీవేన్స్ స్వీకరిస్తూ గ్రామంలో ఉన్నప్రతీ ఇంటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని చెప్పారు. ధాన్యంకొనుగోలులో పడుతున్న ఇబ్బందులు చెబుతూ అన్ని గ్రామాల్లో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. గతతెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగిన తీరు అందరికి తెలుసునని చెప్పారు.ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాగునీటికోసం పట్టించుకోక పోవడంతో ఇదేంఖర్మ ఆని రైతులు అంటున్నారని తెలిపారు. నిత్యావసర సరకులధరలుపెంపు, గ్యాస్ సిలిండర్ ధర పెంపు ,కరెంట్ చార్జీలుపెంపును చూసిన ప్రజలు ఈ ప్రభుత్వంతో ఇదేం ఖర్మ అంటున్నట్లు తెలిపారు.ఎన్నికలు వచ్చే వరకు అన్ని గ్రామాలలో ఇంటింటికి వెళ్లి గతమూడున్నర ఏళ్లలో వైఎస్సార్సీపీ ఆన్నివిధాలుగా వైపల్యం చెందిందో దీనిద్వారా వివరిస్తామని చెప్పారు. నిరుద్యోగం, ఆడబిడ్డలకు భద్రత ఏది, బాదుడే బాదుడు, మద్యాంద్ర ప్రదేశ్, ఊసేలేని అభివృధ్ధి, కానరానిరోడ్లు, ఇసుక ఇక్కట్లు, ఏపీరాజదాని ఏది?, అనకొండలా అవినీతి, షాక్ కొట్టించే కరెంటుధరలు, గిట్టనిగిట్టుబాటుధరలు తదితర అంశాలపై ప్రభుత్వ వైపల్యాలను వివరిస్తూ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ఆని చెబుతామని తెలిపారు.చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయడమే అందరి ప్రధానలక్ష్యమని, దీనికోసం రేయింబల్లు కష్టపడి పనిచేస్తామని చెప్పారు. టీడీపి కార్యక్రమాలకు ప్రజలు,అభిమానులు అన్ని చోట్ల పెద్దఎత్తున హాజరగుతున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img