విశాలాంధ్ర – శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ ( యు జే ఎఫ్) రూపొందించిన ఉత్తరాంధ్ర సమగ్ర సమాచార దర్శిని ( హ్యాండ్ బుక్) జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ఆవిష్కరించారు. అరసవల్లి సూర్య నారాయణ స్వామి సన్నిధిలో బుధవారం ఉగాది పూజల అనంతరం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి కి పలు సూచనలు సలహాలు ఇచ్చి అభివృద్ధికి పాటుపడాలి అని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా పౌర సంబంధాల అధికారి కె. బాల మాన్ సింగ్, యు జే ఎఫ్ నాయకులు చౌదరి లక్ష్మణ రావు, ఎస్. కనకారావు, ఏ పీ బీ సీ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆగురు ఉమా మహేశ్వరరావు, పలువురు జర్నలిస్టులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.