Friday, December 1, 2023
Friday, December 1, 2023

ఆత్మహత్యలను నివారిద్దామని పోలీసులు మహిళలు ఆద్వర్యంలో ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహణ

విశాలాంధ్ర,సీతానగరం: ఆత్మహత్యలను అంతా కలిసి సామాజిక భాద్యతగా నివారణచేద్దామని సీతానగరం మండలంలోని పలుగ్రామాల్లో ఎస్ ఐ నీలకంఠం అధ్వర్యంలో ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు.మంగళ వారం జరిగినప్రతిజ్ఞలో గౌరవనీయులైన మిత్రులారా, తల్లిదండ్రులారా, సోదర సోదరీమణులారా, గురువులారా, మేధావులారా, మనఆత్మీయులు, కుటుంబసభ్యులు, స్నేహితులు,
ప్రేమికులు జీవనసమస్యలకు పరిష్కారంగాఆత్మహత్యనుఎన్నుకొని తమజీవితాలనుమద్యంతరంగా ముగించుకొని తమవారికి తీరనిశోకాన్ని, సమస్యలనుమిగిలించి మరణిస్తున్నారు. ఈమార్గం సరైనదికాదని, సమస్యలను నిబ్బరంగా ఎదుర్కొనే మనోస్థైర్యం విద్యార్థులు,
యువతీయువకులు, ప్రజలలో కల్పించే ఉద్దేశ్యంతో  “అంతర్జాతీయ ఆత్మహత్యా నివారణ దినం” సందర్భంగా సమస్యలకు పరిష్కారమార్గంగా ఆత్మహత్య ప్రయత్నం చేయమని, ఆత్మీయులతో మనసువిప్పి యితర పరిష్కారయత్నాలు చేస్తామని
ప్రతిజ్ఞచేద్దాం. ఆత్మహత్య ఆలోచనలను అందరి మనసుల నుండి దూరం చేద్దాం. ఈ చిన్న ప్రయత్నంలో మీరు మీచుట్టూ ఉన్నవారిచేత, ఆత్మీయులచేత, కుటుంబ సభ్యులచేత ప్రతిజ్ఞ చేయించి
ఈకార్యక్రమంలో మీరూ భాగస్వాములుగా మారి ప్రాణాలను నిలబెట్టమని విజ్ఞప్తి అని తెలిపారు.స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బొబ్బిలి రేణుక, కళాశాల అధ్యాపకులు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారులు రవి కుమార్,రామకృష్ణ వాలంటీర్లు, హెచ్ సి లావణ్య, మహిళా పోలీసులు పద్మ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అధ్వర్యంలో అన్ని గ్రామాలలో మహిళా పోలీసులు మహిళలతో ప్రతిజ్ఞలు చేయించారు. ఆత్మహత్యల ఆలోచన విధానాన్ని దరిచేరకుండా అంతా కలిసి ఆలోచన చేయాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img