Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఉత్తరాంధ్ర పట్టభద్రుల వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ను గెలిపించాలి

సీతానగరంనేతల ప్రచారం

విశాలాంధ్ర,సీతానగరం:ఉత్తరాంధ్ర పట్టభద్రుల వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న (బ్యాలెట్ పేపర్లో సీరియల్ నంబరు 03) సీతంరాజు సుధాకర్  పేరుకు ఎదురుగా రోమన్ సంఖ్య 1 ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని సీతానగరం మండలకమిటీ వైఎస్సార్సీపీ నేతలు పిలుపునిచ్చారు.సోమవారం మండలంలోని బూర్జ, వెంకటపురం, చిన్నయ్యవలస,నిడగల్లు, ఇప్పలవలస, పాపమ్మవలస, సూరమ్మపేట, మరిపివలస , చిన్నారాయుడుపేట, గుచ్చిమి, జోగమ్మపేట గ్రామాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పట్టభద్రుల ఓటర్ల ఇళ్లకు వెళ్లి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు.ఉత్తరాంధ్ర ప్రజల జీవితఆశయం పరిపాలన రాజధానిగా విశాఖపట్నంను చూడాలంటే ఉత్తరాంధ్ర జిల్లాల పట్టబధ్రుల ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్సి అభ్యర్థి  సీతంరాజు సుధాకర్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెబుతూ  గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్న గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓటర్ల ఇంటి వద్దనే నేరుగా వారిని కలుసుకుని ఆప్యాయంగా పలకరిస్తూ మన సీఎం వైఎస్ జగన్ బలపరిచిన అభ్యర్థి సీతంరాజు సుధాకర్ పేరుకి ఎదురుగా 1ఒకటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. శాసనసభ, స్థానిక ఎన్నికల తరహాలో ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. ఎమ్మెల్యే జోగారావు సూచనలు మేరకు అన్ని గ్రామాలలో ఓటర్లను కలుస్తూ ఓటు వేయాలని కోరుతున్నట్లు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొంగు చిట్టిరాజు తెలిపారు. గత వారం రోజులుగా స్థానిక ఎన్నికల కంటే ఎక్కువగా వైఎస్సార్సీపీ మండల, గ్రామ కమిటీల నాయకులు,కన్వీనర్లు, పిఓసిలు ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.
పార్టీ అదేశాలు మేరకు మండలంలోని 35గ్రామ పంచాయతీలోనీ అన్నిగ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నామని ఆయన అన్నారు .విద్యావంతులైన పట్టభద్రులు ఆలోచన చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ను గెలిపించాలని కోరుతున్నారు.
ఈకార్యక్రమంలో మాజీ జెడ్పి ఛైర్మన్, జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు వాకాడ నాగేశ్వర రావు,ఎంపిపి ప్రతినిథి బలగ శ్రీరాములు నాయుడు, జెడ్పీటీసీ బాబ్జి, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు పోల ఈశ్వరనారాయణ,నాయకులు కొట్నాన రత్నాకర్, తెంటు వెంకటఅప్పలనాయుడు, అంబటి కృష్ణం నాయుడు,ఆర్వీ పార్థసారథి, బుడితి గౌరునాయుడు, దాసరి నాగరత్నం, బుడితిముకుంద, గోపాల్, యూ సురేష్, ఆర్వీ కిషోర్ , ఆయాగ్రామాల
సర్పంచులు, ఎంపీటీసీలు,కన్వీనర్లు, వైఎస్సార్సీపీనాయకులు ,అభిమానులు,
తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img