విశాలాంధ్ర – పార్వతీపురం : పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో వివిధ నాటుసారా కేసుల్లో పట్టుబడిన 16 వాహనాల వేలంపాటను మంగళవారం నిర్వహించారు. పార్వతీపురం డి.ఎస్పీ సుభాష్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణారావు, ఎస్ ఐ ప్రకృధ్ధీన్ ఆద్వర్యంలో నిబంధనలు మేరకు వేలం పాటను నిర్వహించారు.
ఒకఆటో, 12 బైకులు, మరియు మూడు మోపెడ్ లను వేలం పాట నిర్వహించారు.వీటికి ప్రభుత్వం తరుపున కనీసధర 52వేలరూపాయలుగా నిర్ణయించారు. వేలంపాటకు హాజరైన వ్యక్తులు స్వచ్ఛందంగా లక్షా26వేల 4వందలరూపాయలకు పాడుకున్నారు. జి ఎస్ టి 22వేల752రూపాయలతో కలిపి లక్షా 49వేల 752రూపాయలను ప్రభుత్వానికి జమచేయడం జరిగిందన్నారు. ఈసందర్భంగా పార్వతీపురం డిఎస్పి ఏ సుభాష్, పార్వతిపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కృష్ణారావులు మాట్లాడుతూ నాటుసారా తయారీగాని, అమ్మకంగానీ, రవాణాగాని చేసేసందర్భంలో దొరికే వాహనాలు ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి వాటి యొక్క యజమానులకు అప్పగించబడవని తెలిపారు. అటువంటి వాహనాలపై కేసునమోదుచేసి ఖచ్చితంగా ప్రభుత్వం తరపున పోలీసు వారు జప్తు చేసుకొని వేలంపాట వేసి విక్రయించడం జరుగుతుందన్నారు. కాబట్టి నాటు సారా వ్యాపారం చేయవద్దని అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో వేలం పాట దారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.