Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

బల్లకృష్ణాపురం, దయానిధిపురం గ్రామాల్లో ఘనంగా జరిగిన గ్రామదేవత పండుగలు

విశాలాంధ్ర, సీతానగరం:మండలంలోని బల్లకృష్ణాపురం, దయానిధిపురం గ్రామాల్లో మంగళవారం గ్రామదేవత పండుగలు ఘనంగా జరిగాయి. చిన్నమ్మతల్లి, ముత్యాలమ్మ తల్లులను గ్రామస్తులు, వివిధ గ్రామాలనుండి విచ్చేసిన భక్తజనం మొక్కులు తీర్చుకున్నారు. బల్లకృష్ణా పురంలో సిరిమాను ఉత్సవ సంబరం అంబరాన్ని తాకగానే భక్తులు జేజేలు పలికారు. దయానిధిపురంలో అంజలి రథాన్ని ఎర్పాటుచేయగా భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఆయా గ్రామ సర్పంచులు నడిమింటి రామక్రిష్ణ, యాళ్ల రామారావులతో పాటు కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ద తీసుకొని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈగ్రామదేవత పండుగలను పార్వతీపురం, బొబ్బిలి ఎమ్మెల్యేలు
అలజింగి జోగారావు, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, క్లాస్ 1కాంట్రాక్టర్ శంబంగి వేణు గోపాలనాయుడు, టిడ్కోఛైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎస్ జయమని, రెండు నియోజకర్గాల నాయకులు,అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మతల్లులను పూజించారు.సోమవారం ప్రారంభమయిన ఈ పండుగలు బుదవారంతో ముగుస్తాయి.రెండు రోజుల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వహకులు చెప్పారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్ ఐ నీలకంఠం అధ్వర్యంలో సర్కిల్ పరిధిలో బందోబస్తును ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img