న్యాయవాదులతో పయనం – సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి
- బార్ అసోషియేషన్ పూర్వ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు
విశాలాంధ్ర – శ్రీకాకుళం: న్యాయవాదుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి అందరి కంటే ముందుంటానని శ్రీకాకుళం జిల్లా బార్ అసోషియేషన్ పూర్వపు అధ్యక్షులు, ప్రస్తుతం బార్ అసోషియేషన్ అధ్యక్ష పదవి రేసులో ఉన్న డాక్టర్ ఎన్ని సూర్యారావు విజ్ఞప్తి చేశారు. బుధవారం నగరంలోని ఓ ప్రయివేటు హోటల్‌లో ఆయన విలేకరుల సమావేశంలో ఎపీ బీసీ అడ్వకేట్ అసోషియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆగూరు ఉమామహేశ్వరరావు, చౌదరి లక్ష్మణరావు, జర్నలిస్టు సంఘ నేత కొంక్యాన వేణుగోపాల్ తో కలసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన న్యాయవాదులంతా తమ విజ్ఞతతో గతంలో తాను చేసిన సేవలు గుర్తించి మరోసారి శ్రీకాకుళం జిల్లా బార్ అసోషియేషన్ అధ్యక్షునిగా ఎన్నుకొని సేవ చేసే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. గతంలో పని చేసిన అనుభవంతో న్యాయవాదుల సమస్యలపై అవగాహన ఉందని న్యాయవాదులంతా ఈ విషయాన్ని గమనించి ఈ నెల 31న (శుక్రవారం) జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోషియేషన్ హాల్‌లో ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్న పోలింగ్‌లో పాల్గొని బ్యాలెట్ పేపర్‌లోని సీరియల్ నెం 3లో గల ఎన్ని సూర్యారావును అధ్యక్షులుగా ఎన్నుకోవాలని ఆయన అభ్యర్థించారు.