Friday, April 19, 2024
Friday, April 19, 2024

గిడ్డంగులను మంజూరు చేయాలి

స్యయం సహాయక సంఘాల విజ్ఞప్తి

విశాలాంధ్ర,పార్వతీపురం /కురుపాం: గిరిజన ఉత్పాదకాలను నిలువ చేయుటకు గిడ్డంగులను మంజూరు చేయాలని స్వయం సహాయక సంఘాల సభ్యులు కోరారు.గురువారం మన్యం జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు జాహ్నవి పర్యటించారు. కురుపాంమండలం దండుసురగుడలో  శ్రీసాయి వన్ ధన్ విక్రయ కేంద్రం (వి.డి.వి.కె)ను సందర్శించారు. వి.డి.వి.కె సభ్యులు చేస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.
వి.డి.వి.కె సభ్యులు మాట్లాడుతూ  వి.డి.వి.కెలు లేని సమయంలో ఆటవీ ఫలసాయాలు మధ్యదళారులు, వ్యాపారస్తులకు అమ్మటం వలన తోకంలోను ధరలోను మోసపోయే వారమని  ప్రస్తుతం వి.డి.వి.కె ద్వారా కొనుగోలు చేసి విలువ ఆధారిత చేయడం ద్వారా అదనపు ఆదాయం సంపాదించి లాభాలు పొందుతున్నామన్నారు. కొండచీపుర్ల సాగుకు పెట్టుబడి కష్టంగా ఉందని, ముందుగా కొంత మొత్తం పెట్టుబడిగా మంజూరు చేయడం వలన ఇంకా ఎక్కువ పంట వేసి లాభాలు సంపాదించగమని వివరించారు. రవాణాకు వాహనం సమకూర్చడం, నిల్వ చేయుటకు గిడ్డంగులు మంజూరు చేయాలని కోరారు. ఈసందర్భంగా గుమ్మలక్ష్మీపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఇతర అంశాలను పరిశీలించారు. విద్యార్ధుల ప్రమాణాలు పెరగాలని ఆమె ఆదేశించారు. ప్రభుత్వం గిరిజన సంక్షేమం పై ప్రాదాన్యత ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఐటిడిఎ సహాయ ప్రాజెక్ట్ అధికారి సురేష్ కుమార్, డి.ఆర్.డి.ఏ పిడి వై. సత్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img