Homeఆంధ్రప్రదేశ్కామన్వెల్త్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్ యలమంచిలికి అరుదైన గౌరవం

కామన్వెల్త్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్ యలమంచిలికి అరుదైన గౌరవం

- Advertisement -
  • ఉత్తమ క్రీడాకారులకు పురస్కారాల ప్రదానం
    విశాలాంధ్ర – విజయవాడ (స్పోర్ట్స్ కరెస్పాండంట్) : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న కామన్వెల్త్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌–2026లో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ యలమంచిలికి అరుదైన గౌరవం లభించింది. అమెచ్యూర్‌ కబడ్డీ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆహ్వానం మేరకు ఛాంపియన్‌షిప్‌కు హాజరైన ఆయనకు భారత్‌–శ్రీలంక మ్యాచ్‌లో ఉత్తమ క్రీడాకారులకు పురస్కారాలు అందించే అవకాశం కల్పించారు.
    ఈ సందర్భంగా ఉత్తమ రైడర్‌గా ఎంపికైన పంకజ్‌ మోహితే, ఉత్తమ డిఫెండర్‌గా నిలిచిన నితేష్‌ కుమార్‌లకు ఒక్కొక్కరికి రూ.10 వేల నగదు పురస్కారాన్ని శ్రీకాంత్‌ అందజేశారు. అంతకుముందు బంగ్లాదేశ్‌–సింగపూర్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు గౌరవ అతిథిగా హాజరై లాంఛనప్రాయంగా టాస్‌ వేశారు.
    అంతర్జాతీయ క్రీడా వేదికపై శ్రీకాంత్‌కు లభించిన ఈ గుర్తింపు పట్ల ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షురాలు కె.వి. ప్రభావతి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అర్జునరావు నక్కల, సీనియర్‌ జాయింట్‌ సెక్రటరీ కె.వి. నాంచరయ్య, కోశాధికారి ఎం. సుబ్బరాజు హర్షం వ్యక్తం చేశారు. కబడ్డీ క్రీడ ప్రచారం, అభివృద్ధికి ఆయన చేస్తున్న నిరంతర కృషిని అభినందిస్తూ ప్రత్యేకంగా ప్రశంసించారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు