Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండి..

ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండి..

- Advertisement -

స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్. డాక్టర్. వై సోనియా
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని పుట్టపర్తి రోడ్, సాయి నగర్, బాబా దేవాలయం వద్ద గల స్పందన హాస్పిటల్ లో ఈనెల 29వ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత సంతాన సాఫల్య, గర్భకోశ వ్యాధుల వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు స్పందన హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ వై. సోనియా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంతానం కలుగని దంపతులను పరీక్షించడం, అవసరమైన వారికి స్కానింగ్ నిర్వహించి, సలహాలు చికిత్స సూచించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా గర్భకోస వ్యాధులు కలవారికి కూడా ఉచితంగా పరీక్షించడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని దంపతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఉచిత ఊపిరితిత్తుల, చాతి జబ్బుల వైద్య శిబిరం:: పట్టణంలోని సాయిబాబా గుడి వద్ద గల స్పందన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఈనెల 29వ తేదీ ఆదివారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత ఊపిరితిత్తుల, ఛాతి జబ్బుల వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు స్పందన హాస్పిటల్ అధినేతలు డాక్టర్. బషీర్, డాక్టర్. సోనియా తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ పూర్ణచంద్ర ఈ శిబిరంలో రోగులకు చక్కటి వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్యమును కాపాడుకోవడంలో పాటించాల్సిన పద్ధతులను తెలియజెప్పడం జరుగుతుందన్నారు. ఉచిత వైద్య చికిత్సలతో పాటు మందులను కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు. అంతేకాకుండా అన్ని అవసరమైన పరీక్షలకు 50 శాతం రాయితీ కూడా కల్పించబడుతుందని తెలిపారు. అలర్జీ, దగ్గు, ఆయాసము, ఆస్తమా, క్షయ, నిమోనియా, ఎలర్జీక్ బ్రామ్ కైటిస్ లకు చికిత్స, ఊపిరితిత్తులో నీరు, చీము, రక్తం చేరిన వారికి చికిత్స, అలర్జీ పరీక్షల ద్వారా కారణాన్ని గుర్తించడం, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ద్వారా ఊపిరితిత్తుల జబ్బు తీవ్రతను గుర్తించడం, శ్వాస కష్టమైన రోగులకు వెంటిలేటర్, హైప్లో ఆక్సిజన్, నెబులైజర్, ఐసీయూ సౌకర్యం కూడా కలదని తెలిపారు. కావున ఇటువంటి ఉచిత వైద్య శిబిరములను పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని పొందాలని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9441069900కు గాని 9441062200 కు గాని 9908708880 కు గాని, 85008588 88 కు సంప్రదించాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు