Sunday, December 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత సంతాన సాఫల్య అవగాహన శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

ఉచిత సంతాన సాఫల్య అవగాహన శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

- Advertisement -

స్పందన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్,డాక్టర్ సోనియా
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణములోని పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి దగ్గర గల స్పందన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యందు ఈ నెల 19వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత సంతాన సాఫల్య అవగాహన శిబిరమును సద్వినియోగం చేసుకోవాలని స్పందన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పిల్లలు పుట్టకపోవడం (ఇన్ ఫర్టిలిటీ) అనేది చేయదగిన మరొక వైద్య స్థితి అని తెలిపారు. గర్భం దాల్చడానికి సంవత్సర కాలంగా ప్రయత్నిస్తూ ఉండడం, అనేకసార్లు గర్భస్రావాలు కావడం, అనేక ఐ యు ఐ లేదా ఐ వి ఎఫ్ వైఫల్యాలు కలగడం, రిపోర్టులు మామూలుగా ఉన్నప్పటికీ గర్భం దాల్చలేక పోవడం, వీర్యం కౌంట్ తక్కువగా ఉండడం లేదా వీర్యం కౌంట్ లేకపోవడం, పి సి ఓ ఎస్ సమస్యలు, పాలో పియన్ ట్యూబ్ పోవడం, ఎండ్రోమెట్రియోసిస్ లేదా గర్భాశయం లో ఫైబ్రాయుళ్లు ఉండదన్న అభిప్రాయాలు వాటికి నిపుణులైన వైద్యులచే చికిత్స నిర్వహించబడినది తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సంతానము లేని దంపతులు సద్వినియోగం చేసుకొని సంతానము కలిగించుకొని చక్కటి జీవితాన్ని పొందాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు