విశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం పట్టణానికి చెందిన టిడిపి నాయకులు నెట్టెం కేశవ నాయుడు (50) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. వీరి స్వగ్రామం నెట్టo కేశవ నాయుడు స్వస్థలం తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం సోమనపల్లి గ్రామానికి చెందినవారు కాగా 30 ఏళ్ల క్రితం ధర్మవరం పట్టణo శాంతినగర్ కు కుటుంబంతో వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. బొలెరో వాహనం డ్రైవర్గా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీలో చురుకైన నాయకుడుగా పనిచేశారు. మార్చి నెల 31వ తేదీన తాడిపత్రి కి వెళ్లి ద్విచక్ర వాహనంలో తిరిగి వస్తుండగా పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట వద్దకు రాగానే ద్విచక్ర వాహనం స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి కింద పడ్డారు. తీవ్ర గాయాలైన కేశవ నాయుడును హుటా హుటిన అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. మృతి చెందారు అన వార్త తెలియగానే కుటుంబ సభ్యులు బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వగ్రామమైన సోమనపల్లికి తరలించారు. టిడిపి నాయకులు నంబూరి నాగరాజు తదితరులు మృతదేహానికి నివాళులర్పించారు. కాగా మృతుడు కేశవ నాయుడుకి భార్య మహేశ్వరి, ఇద్దరు కుమారులు కిషోర్, కిరణ్ ను ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టిడిపి నాయకులు కేశవ నాయుడు మృతి
- Advertisement -
RELATED ARTICLES


